twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas కోసం నాగ్ అశ్విన్ సెన్సేషనల్ ప్లాన్: RRRను మించిపోయేలా.. చరిత్రను సృష్టించే దిశగా అడుగు

    |

    కృష్ణంరాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాదు, ఏక కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ స్టార్ హీరో అనౌన్స్ చేసిన చిత్రాల్లో నాగ్ అశ్విన్ ప్రాజెక్టు కూడా ఉంది. పాన్ వరల్డ్ మూవీగా చెప్పుకుంటోన్న దీని విషయంలో తాజాగా సదరు దర్శకుడు ఓ సెన్సేషనల్ ప్లాన్ వేశాడని తెలిసింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

    ఆ రెండింటితో రేంజ్ పెరిగిపోయింది

    ఆ రెండింటితో రేంజ్ పెరిగిపోయింది

    చాలా కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీకే పరిమితం అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కానీ, దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి'తో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పుడు అన్ని ఇండస్ట్రీలకూ పరిచయం అయ్యాడు. దీంతో ఆ తర్వాత వచ్చిన 'సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేశాడు. ఇది హిందీలో రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకుంది.

    ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి ఆ పాత్ర

    ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి ఆ పాత్ర

    రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ మూవీలో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

    అదనుకుంటే... మిగతావి ప్రారంభం

    అదనుకుంటే... మిగతావి ప్రారంభం

    'రాధే శ్యామ్' షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాను ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే మూవీ ప్రకటించాడు. కానీ, నాగ్ అశ్విన్ మూవీ కంటే ముందే ఈ రెండు చిత్రాలను ప్రారంభించేశాడు.

    అదే కాన్సెప్టు.. పాన్ వరల్డ్ మూవీ

    అదే కాన్సెప్టు.. పాన్ వరల్డ్ మూవీ

    నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్ చేసే మూవీలో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, సినిమా కథ గురించి పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టైం మెషీన్‌ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన 'ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. ఇది పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది.

    వాయిదా పడిపోయిన భారీ చిత్రం

    వాయిదా పడిపోయిన భారీ చిత్రం

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల మొదలవలేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య మీడియాతో మాట్లాడిన దర్శకుడు నాగ్ అశ్విన్ దీన్ని అక్టోబర్‌ నుంచి ప్రారంభిస్తామని వెల్లడించాడు. కానీ, ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    RRRను మించిలా డైరెక్టర్ ప్లాన్

    RRRను మించిలా డైరెక్టర్ ప్లాన్

    ప్రభాస్‌తో చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో నాగ్ అశ్విన్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. దీన్ని హాలీవుడ్ రేంజ్‌లో తీయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే ఎన్నో ప్లాన్లు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను RRRను మించిపోయేలా విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    Recommended Video

    Prabhas పై Mission Impossible 7 Director కామెంట్స్, రూమర్స్ కి చెక్ || Filmibeat Telugu
    చరిత్రను సృష్టించే దిశగా అడుగు

    చరిత్రను సృష్టించే దిశగా అడుగు

    RRR మూవీని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం, ఇంగ్లీష్, ప్రోర్చుగీస్, కొరియన్, టర్నిష్, స్పానిష్ ఇలా పది భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ మాత్రం 15 భాషల్లో రాబోతుందట. పైన ఉన్న భాషలకు తోడు చైనా, జపనీస్ సహా మరో మూడు భాషల్లో కూడా ఇది రిలీజ్ కాబోతుందట. ఇదే జరిగితే ఇండియాలో చరిత్రే అవుతుంది.

    English summary
    Prabhas Doing Several Movies At a Time. Nag Ashwin Movie Also In This List. This Director Plan to Release Movie in 15 languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X