»   » నాగార్జున ‘భాయ్’రిలీజ్ డేట్ ఖరారు

నాగార్జున ‘భాయ్’రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్ కి మంచి స్పందన లభించింది. దాంతో ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఈ 20 న జరగనుంది.


ఇప్పటికే ఈ సినిమా టాకీ భాగం ముగించుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ ను ముగించుకున్న ఈ సినిమా ఆ పాటను ఈ నెల 13, 14 మరియు 15వ తేదిలలో పూర్తిచేసుకుంటుంది. ఈ సినిమాలో పక్కా మాస్ పాత్రలో నాగార్జున కనువిందుచెయ్యనున్నారు. వీరభద్రం చౌదరి దర్శకుడు. రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. ఈ చిత్రాన్ని రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదలచెయ్యనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

'భాయ్' మూవీ తెలుగుతో పాటు తమిళ అనువాదంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలోనూ ఈచిత్రాన్ని 'భాయ్' పేరుతోనే విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

నాగినీడు, జరాసా, వినయప్రసాద్, సంధ్యా, ఝనక్ ప్రసాద్, చలపతి, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, ప్రసన్న, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.

English summary
Nagarjuna’s ‘Bhai’ is getting ready for release. The movie has completed about of its shoot. ‘Bhai’ is getting ready to hit the screens on October 4th. The audio album will be released on September 20th. The film’s talkie part has already been completed and only the last song remains to be shot. Shooting will take place on the 13th, 14th and 15th of this month. Nagarjuna will be seen in a full fledged mass avatar in this movie. Veerabhadram Chowdhary is the director and Richa Gangopadhyay is the heroine.
Please Wait while comments are loading...