For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నాగార్జున ‘భాయ్’రిలీజ్ డేట్ మారింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్ కి మంచి స్పందన లభించింది. దాంతో ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం అత్తారింటికి దారేది విడుదల ముందుకు రావటంతో రిలీజ్ వెనక్కి వెళ్లింది. అక్టోబర్ 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే చిత్రం ఆడియోని అక్టోబర్ 1న విడుదల చేయనున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఇంకా ప్రకటన రాలేదు.

  నాగార్జున హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న 'భాయ్' సినిమా షూటింగ్ పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏడెకరాల్లో వేసిన రాజస్థాన్ సెట్‌లో 'అయ్ బాబోయ్ నీ చూపే చిలక ముక్కులా.. నా మనసుని కరా కరా కొరుకుతున్నాదే..' అనే పాటను నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్, వంద మంది డాన్సర్లపై చిత్రీకరించడంతో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. భాస్కరభట్ల రాసిన ఈ పాటకు రాజు సుందరం కొరియ్రోగఫీ సమకూర్చారు.

  వీరభద్రమ్ మాట్లాడుతూ 'భాయ్' ఫస్ట్ లుక్‌కీ, టీజర్‌కీ గొప్ప స్పందన వచ్చిందనీ, ఇందులోని డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయనీ అన్నారు. "ప్రేక్షకుల, నాగార్జున గారి అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే చాలా పెద్ద రేంజిలో ఉంటుంది సినిమా. కచ్చితంగా నాకు హ్యాట్రిక్ సినిమా అవుతుంది'' అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సాయిబాబు మాట్లాడుతూ "ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. సినిమా రిలీజ్ డేట్‌ను కొద్ది రోజుల్లో ప్రకటిస్తాం'' అని తెలిపారు.

  ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.

  English summary
  Earlier Nagarjuna’s Bhai was slated for October 4th release. But since the release of Attarintiki Daredhi was advanced, the makers of Bhai decided to come on October 9th and enter Dussehra fray. The movie shooting is complete and the post production works are going on at full swing. The audio release function will be on October 1st.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more