»   » ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? : నాగచైతన్య, సమంత ఇంత ఇంటిమసిగా.. ( లీక్ వీడియో)

ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? : నాగచైతన్య, సమంత ఇంత ఇంటిమసిగా.. ( లీక్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తగా నలుగుతున్న సమంత, నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి ఓ సాయింత్రం బాల్కనీలో ఉన్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వీళ్లిద్దరు కలిసి సరదాగా కబుర్లు చెప్తూ గడిపారని అర్దం అవుతోంది. ఈ వీడియోతో వీరి ప్రేమ నిజమే అని ఖరారు చేసినట్లే.


ఇక మరో ప్రక్క తన ప్రేమ విషయమై చాలా కాలంగా ఇంట్లో వారితో పోరాడుతున్న నాగచైతన్య ఆల్ మోస్ట్ అందరిని ఒప్పించాడని వినపడుతోంది. అయితే ఈ విషయంలో నాగార్జున పెద్దగా ఇంట్రెస్ట్ గా లేడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కాని నాగచైతన్య మాత్రం తన తల్లి ద్వారా ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే...సోగ్గాడే చిన్న నాయినా చిత్రంతో పరిచయమైన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం చేయాలని , ఆ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే కథ, కథనాలు సిద్ధమైనట్టు సమాచారం. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెడతారని తెలిసింది. ఇందులో నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి.

స్లైడ్ షోలో మరింత సమచారం.

ధియోటర్ లో

ధియోటర్ లో

వీరిద్దరకూ కలసి సినిమాకు వెళ్లారని, అది అ..ఆ అని అప్పుడు తీసిన ఫొటో అంటూ ఈ ఫొటో ప్రచారంలోకి వచ్చింది.

హాట్ టాపిక్ గా...

హాట్ టాపిక్ గా...

నాగచైతన్య తాజా చిత్రాల కంటే ఆయన ప్రేమ వ్యవహారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాపిక్ ఆఫ్‌ ది టౌన్ గా నిలిచింది.

మీడియా మొత్తం

మీడియా మొత్తం

చైతూ .. సమంతాతో ప్రేమలో పడ్డాడనే విషయం తెలిసినప్పటినుండి మీడియా మొత్తం ఈ విషయం మీదే కాన్సర్టేట్ చేసింది. అయితే ఇది నాగచైతన్యకు నచ్చటం లేదని అంటున్నారు.

మరో ప్రక్క...

మరో ప్రక్క...

సమంత ప్రేమలో మునిగి తేలుతున్న చైతన్య తన పెళ్లికి మదర్ సపోర్ట్ తీసుకోవాలని అనుకున్నాడట. అంతేకాదు తన మదర్ ని చెన్నై పంపించి అక్కడ సమంతతో ఓ రోజు మొత్తం చెన్నైలో గడపమని చెప్పాడట.

గ్రీన్ సిగ్నల్

గ్రీన్ సిగ్నల్

ఇక చెన్నై వెళ్ళిన నాగ చైతన్య మదర్ సమంత గుణగణాల గురించి తెలుసుకుని వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. కాకపోతే ఈ విషయంలో నాగ్‌ కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరి నాగ్ ఏమంటారో

మరి నాగ్ ఏమంటారో

నాగచైతన్య, సమంతల ప్రేమకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. అప్పట్లో అమల కూడా సినీ నటి కావటంతో, ఆమెను నాగార్జున వివాహం చేసుకోవటంతో ఈ పెళ్లికి కూడా నాగచైతన్య ఓకే అనే అవకాసం ఉంది.

జబర్దస్త్

జబర్దస్త్

నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో సమంత ...సిద్దార్ద సరసన చేసింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

సమ్ ధింగ్ సమ్ ధింగ్

సమ్ ధింగ్ సమ్ ధింగ్

సిద్దార్ద, సమంత కాంబినేషన్ లో సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్లాఫ్ అయ్యింది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

రామయ్యా వస్తావయ్యా

రామయ్యా వస్తావయ్యా

ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

మనం

మనం

నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో సమంత మరోసారి నాగచైతన్య సరసన నటించింది. ఈ చిత్రం హిట్టైంది.

ఆటోనగర్ సూర్య

ఆటోనగర్ సూర్య

దేవకట్టా దర్శకత్వంలో ..సమంత,నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ...ఫ్లాఫ్ అయ్యింది.

అల్లుడు శ్రీను

అల్లుడు శ్రీను

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివివినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేసింది. సినిమా హిట్టైంది.

రభస

రభస

ఎన్టీఆర్ తో మరోసారి జతకట్టిందీ ఈ చిత్రంతో సమంత. కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ యావరేజ్ గ్రాసర్ అనిపించుకుంది.

24

24

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో బాగానే వర్కవుట్ అయ్యింది. సమంతకు మంచి మార్కులే పడ్డాయి.

బ్రహ్మాత్సవం

బ్రహ్మాత్సవం

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో మహేష్ సరసన మరోసారి మెరిసింది సమంత. సినిమా డిజాస్టర్ అయ్యింది.

అ..ఆ

అ..ఆ

నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్టై కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ సినిమా మొత్తం సమంత చుట్టూనే తిరుగుతుంది.

జనతాగ్యారేజ్

జనతాగ్యారేజ్

ఎన్టీఆర్ సరసన మరోసారి చేస్తుంది సమంత. కొరటాల శివ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

    English summary
    Naga Chaitanya and Samantha have worked together in three films till date. A source says that the two might be paired once again.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu