»   » వంగవీటి మోహన్ రంగ పాత్రలో నాగచైతన్య?

వంగవీటి మోహన్ రంగ పాత్రలో నాగచైతన్య?

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ.ఆయన పాత్రలో నాగచైతన్య కనిపించనున్నాడని సమాచారం. బెజవాడ రౌడీలు టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ రూపొందించనున్న చిత్రంలో నాగ చైతన్య ఈ పాత్ర చేస్తున్నాడని తెలుస్తోంది.విజయవాడ నేఫధ్యంలో రామ్ గోపాల్ వర్మ రూపొందనున్న తాజా చిత్రం ' బెజవాడ రౌడీలు' టైటిల్ ప్రకటించగానే సంచలనం రేగిన ఈ చిత్రాన్ని ఇన్నాళ్ళూ రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తారనుకున్నారు. అయితే ఈ సినిమాని వర్మ శిష్యుడు వివేక్ డైరక్ట్ చేయనున్నాడు. రామ్ గోపాల్ వర్మ కేవలం సమర్పిస్తారు .అప్పలరాజు నిర్మించిన కిరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని ఇప్పటికే అంతటా పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రం బెజవాడలోని రౌడీయిజం,గూండాయిజం నేపధ్యంలో సాగనుంది.

English summary
Real life character of Vangaveeti Mohan Ranga, hero of Bejawada Rowdyism is taken up Naga Chaitanya in 'Bejawada Rowdilu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu