»   » అదరకొడతాడా? తొలిసారిగా నాగచైతన్య...పోలీస్ గెటప్ లో

అదరకొడతాడా? తొలిసారిగా నాగచైతన్య...పోలీస్ గెటప్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం సినిమాల్లో పోలీస్ కథల రాజ్యం నడుస్తోంది. ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడన్న కథతో వరస పెట్టి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ పోలీస్ అధికారి ప్రేమ కథతో నాగచైతన్య దిగబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం రెడీ అవుతోంది. తమిళంలో శింబు హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు రచయిత కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక సమంత మినహా దాదాపుగా ఏమాయ చేశావే టీమ్ మొత్తం.. ఈ సినిమాకు రీపీట్ అవుతుండగా.. మరోసారి లవ్ స్టోరీతోనే మ్యాజిక్ చేసే పయత్నంలో ఉన్నాడట గౌతమ్ మీనన్.

హైవే జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. నదియా, బాబాసెహగల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది.

నాగచైతన్య మాట్లాడుతూ ఏమాయ చేసావే సినిమాతో నేను ప్రేమకథా చిత్రాలకు బాగా సూటవుతానని గౌతమ్ మీనన్ నిరూపించారు. ప్రేక్షకుల్లో కూడా నా సినిమా అంటే మంచి క్రేజ్ మొదలైంది. ప్రేమకథా చిత్రాల్ని గౌతమ్ మీనన్ ఏవిధంగా తెరకెక్కిస్తారో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లని కూడా అదే స్థాయిలో రూపొందిస్తారన్న పేరుంది.

Naga Chaitanya to impress in cop avatar

ఈ సినిమాలో ఫస్ట్‌హాఫ్ అంతా ఏమాయ చేసావే ఫ్లేవర్‌తో సాగితే సెకెండ్‌హాఫ్ యాక్షన్ నేపథ్యంలో వుంటుంది. ఇలా రెండు రకాల నేపథ్యంలో వున్న సినిమా ఒక నటుడిగా నాకు దక్కడం ఆనందంగా వుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ కథకు అనుగుణంగానే టైటిల్‌ని పెట్టడం జరిగింది.

ఈ టైటిల్ రేష్మా ఘటాల సూచించారు. ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. రెహమాన్ ఆరు అద్భుతమైన పాటలిచ్చారు. సినిమాలో మాత్రం నాలుగు పాటలే వుంటాయి. మంజిమ మోహన్ బ్రిలియెంట్ నటి. ఈ సినిమా తరువాత అంతా ఆమె ప్రేమలో పడిపోతారు. అంత అద్భుతంగా నటించింది అన్నారు.

సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ సినిమా రోటీన్ కమర్షియల్ ఫార్ములాను బ్రేక్ చేస్తుంది అని కోన వెంకట్ తెలిపారు. గౌతమ్ మీనన్, ఏ.ఆర్.రెహమాన్ వంటి గ్రేట్ టెక్నీషియన్‌లతో కలిసి తొలి సినిమా చేయడం గర్వంగా వుంది అని నిర్మాత రవీందర్‌రెడ్డి తెలిపారు.

'ఏ మాయ చేసావె' చిత్రం తెలుగులో నాగ చైతన్య, తమిళంలో శింబు చేసినట్లే.... 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా తెలుగులో చైతన్య, తమిళంలో శింబు చేయబోతున్నారు. 'ఏ మాయ చేసావె' టైటిల్ మాదిరిగానే ఈ టైటిల్ కూడా ఒక్కడు మూవీ సాంగ్ లిరిక్ నుండి తీసుకున్నదే కావడం గమనార్హం.

English summary
For the first time in his career,Naga Chaitanya is going to be seen in a cop avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu