»   » నానినా లేక నాగచైతన్య నా? ఎవరు ఓకే చేసారు? సమంత ఉంటుందా

నానినా లేక నాగచైతన్య నా? ఎవరు ఓకే చేసారు? సమంత ఉంటుందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎవరు ఆ రీమేక్ లో నటించబోతున్నారు..నానినా లేక నాగచైతన్య నా అనేది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అలాగే సమంత సైతం ఈ రీమేక్ పై ఆసక్తి చూపెడుతున్నట్లు చెప్తున్నారు. సమంత చేస్తోంది కాబట్టి నాగచైతన్య నే హీరో కావచ్చు అని కూడా ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఇంతకీ ఏమిటా రీమేక్, అసలు విషయమేంటి అంటే...

ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం 'టు స్టేట్స్‌'. 2014లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్‌ కానుంది. కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌, సాజిద్‌ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Naga Chaitanya in Bollywood remake

దర్శకుడు వీవీ వినాయక్‌ దగ్గర పలు చిత్రాలకు కోడైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్‌ కుంచెమ్‌ ఈ చిత్రం తెలుగు రీమేక్‌ హక్కులు దక్కించుకున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను తెలుగులో నిర్మించనున్నట్లు ప్రకటన చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రీమేక్ లో ఎవరు నటించనున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో హీరో గా నాని గాని నాగచైతన్య గాని చేసే అవకాసం ఉన్నట్లు చెప్తున్నారు.

భిన్న సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన ఓ జంట ప్రేమకథతో రూపొందించనున్న ఈ చిత్రం రైట్స్ ని 55 లక్షలకు సొంతం చేసుకున్నారని, ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, రేవతి వంటి సీనియర్స్ తో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించాలనే ఫిక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామని నిర్మాత అభిషేక్ నామా పేర్కొన్నారు.

English summary
Nizam based producer Abhishek Nama of Abhishek Pictures is all set to remake Bollywood film ” 2 States ” in Telugu. While the Hindi version had Arjun Kapoor and Alia Bhat as the lead pair. V.V. Vinayak assistant Venkat Kuchem will be directing the film .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu