»   » 'ప్రేమమ్‌' రీమేక్ ఖరారు..హీరో,దర్శకుడు ఎవరంటే

'ప్రేమమ్‌' రీమేక్ ఖరారు..హీరో,దర్శకుడు ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్యకాలం చిన్న బడ్జెట్ లో వచ్చి మళయాళంలో సూపర్ హిట్టైన చిత్రం 'ప్రేమమ్‌'. ఇదో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తారని తెలిసింది. కె.రాధాకృష్ణ నిర్మిస్తారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తారని ఫిల్మ్‌నగర్‌టాక్‌. ఇటీవల చైతూ కూడా ఈ సినిమాని చూశాడట. తనకు బాగా నచ్చి రీమేక్‌కి పచ్చజెండా ఊపేశాడని చెప్పుకొంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Naga Chaitanya in 'Premam' remake ?

జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఇలా కథ సాగుతుంది.

ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.

Naga Chaitanya in 'Premam' remake ?

జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు.

ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

English summary
Naga Chaitanya next film will be Malayalam remake Premam. Radha Krishna is looking to hold the Telugu remake rights of Premam and the movie will be directed by Chandoo Mondeti.
Please Wait while comments are loading...