»   » నాగచైతన్య ‘గౌరవం’నిలబడింది

నాగచైతన్య ‘గౌరవం’నిలబడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: అల్లు శిరీష్ హీరోగా వచ్చిన 'గౌరవం' చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నాగచైతన్య లక్కి అంటున్నారు. దానికి కారణం...మొదట ఈ సబ్జెక్టు నాగచైతన్య దగ్గరకే వచ్చింది. అయితే చివరి నిముషంలో దాన్ని నాగచైతన్య రిజెక్టు చేసారు. అప్పట్లో ఈ చిత్రం కోసం ఫోటో షూట్ కూడా జరిగింది.

అప్పటికే వరస ప్లాపులతో ఉన్న నాగ చైతన్య మరో నాలుగైదు కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు చేసి కెరీర్ గాడిలో పడ్డ తర్వాత 'గౌరవం' సినిమాలో నటించాలని నిర్ణయించుకుని రిజెక్టు చేసారు. రాధా మోహన్ చెప్పిన 'గౌరవం' కథ విని కేవలం సినిమా క్లాస్ పీపుల్ మాత్రమే చూసే సినిమా కావడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చక పోవచ్చని,అందుకే రిజెక్టు చేసినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య జడ్జిమెంట్ కరెక్టు అంటున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య, సునీల్ హీరోలుగా మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సమర్పణలో 'తడాఖా' చిత్రం రూపొందుతోంది. శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లంకొండ గణేశ్‌బాబు మాట్లాడుతూ ' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ నెల 24న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నాం. మే లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.

తమన్నా, ఆండ్రియా కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో అశుతోష్ రాణా, నాగబాబు, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, రమాప్రభ, జయప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి కథ: లింగుస్వామి, మాటలు: వేమారెడ్డి, స్క్రీన్‌ప్లే: దీనక్‌రాజ్, సంగీతం: థమన్, ఫొటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మైనేని ప్రసాద్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిశోర్ పార్థాసాని (డాలి).

English summary
For Radha Mohan’s Gouravam Nagachaitnaya selected as in lead role and some part of photoshot also finished on him. Later in turn of events, he opted out Allu Sirish come into the picture. After it released and getting feedback from the audience that Naga Chitanya is very luck to miss the “Gouravam”.
Please Wait while comments are loading...