»   » నాగచైతన్య హీరోగా ఆ చిత్రం సీక్వెల్

నాగచైతన్య హీరోగా ఆ చిత్రం సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య హీరోగా నాగార్జున కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన నిన్నేపెళ్ళాడతా చిత్రం సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నాగార్జున కూడా మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడుతో చేయదగ్గ బెస్ట్ సీక్వెల్ గా ఈ చిత్రాన్ని చెప్పుకొచ్చారు. అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై నిర్మించే ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణవంశీకి డైరక్షన్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే స్క్రిప్టు వర్క్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దర్శకుడు ఎంపిక జరుగుతుందని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. రొమాంటిక్ సీన్స్ పండాలంటే అదే వయస్సులో ఉన్న దర్శకుడుకి అవకాశమివ్వటం బెటర్ అని కొందరు సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య, గౌతం మీనన్ కాంబినేషన్ లో ఏం మాయ చేసావే చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రం అనంతరం అజయ్ భువన్ దర్శకత్వంలో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం వాటి తర్వాత ఉండే అవకాశం ఉంది. అలాగే ఆ చిత్రంలో నాగార్జున, టబు కూడా కనిపించే అవకాశం ఉందంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu