»   » నాగచైతన్య కొత్త చిత్రం ‘శూన్యం’...డిటేల్స్

నాగచైతన్య కొత్త చిత్రం ‘శూన్యం’...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని యువ హీరో నాగ చైతన్య త్వరలో పరుశరామ్ దర్శకత్వంలో చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం టైటిల్ 'శూన్యం' అని చెప్తున్నారు. ఓ లీడింగ్ ప్రొడ్యూసర్ ఈ చిత్రం నిర్మించనున్నారని తెలుస్తోంది. ఓ విభిన్నమైన కథాంశం అని, ఎంటర్టైన్మెంట్ తో స్క్రిప్టు రూపొందించారని, దాన్ని విన్న వెంటనే నాగచైతన్య ఫస్ట్ మీటింగ్ లోనే ఓకే చేసాడని చెప్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

అలాగే నాగచైతన్య మరో హిట్ దర్శకుడితో జతకట్టబోతున్నాడు. ఇటీవల నితిన్‌తో 'గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కుమార్ కొండ త్వరలో నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి పతాకంపై నాగార్జున అక్కినేని ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. అక్బోబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్టు వర్కుపై దృష్టి పెట్టాడు. ఇది పూర్తయిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది.

'గుండెజారి గల్లంతయ్యిందే' దర్శకుడితో నాగచైతన్య నాగచైతన్య ప్రస్తుతం నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు...ప్రముఖ నిర్మాత రామానాయుడు తన మనవడు నాగ చైతన్య (కూతురు కొడుకు)హీరోగా సినిమా చేయబోతున్నాడు. పంజాబీ హిట్ మూవీ 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రానికి రీమేక్ గా రూపొందబోయే ఈ చిత్రాన్ని తమ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోతున్నారు.

English summary
Naga Chaitanya has reportedly given a nod to team up with young director Parasuram and the movie has been tentatively titled Soonyam. Parasuram has good hits to his credit and his last film was Sarocharu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu