»   » 'ఏ మాయ చేసావె' కి నాగచైతన్య రెమ్యునేషన్ అదా?

'ఏ మాయ చేసావె' కి నాగచైతన్య రెమ్యునేషన్ అదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో గౌతం మీనన్ రూపొందించిన 'ఏ మాయ చేసావె' చిత్రంకి నాగచైతన్యకి ఎంత రెమ్యునేషన్ ఇచ్చి ఉంటారనేది మార్కెట్లో ఎంక్వేరీలు మొదలయ్యాయి. అయితే ఈ చిత్రానికి రెమ్యునేషన్ క్యాష్ రూపంలో ఇవ్వలేదని తెలివిగా నాగార్జున శాటిలైట్ రైట్స్ రాయించుకున్నారని సమాచారం. ఎగ్రిమెంట్ జరిగేటప్పుడు తమ మా టీవీకి ఆ చిత్రం రైట్స్ ఇవ్వాలని, అదే రెమ్యునేషన్ గా బావిస్తామని నాగార్జున చెప్పారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి పన్నెండున్నర కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చుపెట్టారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. ఆ బడ్జెట్ లో మూడు కోట్లు గౌతం మీనన్ తీసుకోగా, రహమాన్ కి రెండు కోట్లు ఇచ్చారుట. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిమిత్తం యాభై లక్షలు వరకూ ఖర్చయిందిట. ఇక హీరోయిన్ కి తెలుగుకి ఇంట్రడక్షన్ కాబట్టి పెద్దగా ముట్టచెప్పలేదట. ఇక మిగిలిన డబ్బు లొకేషన్ కి మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టులకు, షూటింగ్ ఖర్చులకు, ప్రమోషన్ కు ఖర్చు అయ్యిందిని వివరిస్తున్నారు. అయితే మంజులకు మొదట ఎనిమిదిలో పూర్తి చేస్తామని మాట ఇచ్చారుట. అయితే అలా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లారట. ఇక చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి సేఫ్ గా బయిటపడ్డారు అంటున్నారు. అయితే ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ఉంచుకుంటే బావుండేది..మంచి రేట్ వచ్చేది అని ఆమె ఫీలవుతోందిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu