»   » ‘ఆటోనగర్ సూర్య’ మళ్లీ ప్రారంభానికి కారణం (కొత్త ఫోటోలతో ...)

‘ఆటోనగర్ సూర్య’ మళ్లీ ప్రారంభానికి కారణం (కొత్త ఫోటోలతో ...)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా రూపొందుతూ ఆగిపోయి, మళ్లీ మొదలైన చిత్రం ఆటో నగర్ సూర్య. ఈ చిత్రం దీపావళికి విడుదలకు సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం తీసుకుని పూర్తి చేసి,విడుదల చేయనున్నారని సినిమా వర్గాల్లో వినపడుతోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఏ ప్రకటనా లేదు. ఇక ఆగిపోయిన ఈ చిత్రం విడుదలకు రకరకాల కారణాలు కారణాలు వినపడుతున్నాయి.

మొదటిగా క్రేజీ కాంబినేషన్ (నాగచైతన్య,సమంత) కావటం ప్లస్ అంటున్నారు. అంతేగాక నాగచైతన్యతో బెల్లంకొండ రీసెంట్ గా 'తడాఖా' అనే హిట్ కొట్టారు. మళ్లీ నాగార్జునతో బెల్లంకొండ..డాలీ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా ఆటోనగర్ సూర్య ఫినిష్ చేసి విడుదల చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అలాగే సమంత కి బిజినెస్ సర్కిల్స్ లో ఉన్న క్రేజ్ కూడా సినిమా విడుదల అవటానికి కారణంగా చెప్తున్నారు.


ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దేవాకట్ట.... తన ట్విట్టర్లో చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం విషయంలో అంతరాయం తలెత్తిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని త్వరలోనే అన్ని పూర్తి చేసి రిలీజ్ చేస్తానని ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తిగావచ్చిందని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని దేవా కట్టా ట్విట్టర్‌లో తెలిపారు. 'ఆటోనగర్ సూర్య చివరి దశ పనులు త్వరలోనే మోదలవుతాయి. చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత నేను ఇదివరకూ ట్విట్టర్ లో వేస్తున్న ట్వీట్స్ తీసేస్తున్నాను' దేవకట్టా ట్వీట్ చేసాడు.

ఇక నాగచైతన్య 'తడాఖా' చిత్రం తో ప్లాప్ ల నుంచి రిలీఫ్ అయ్యారు. ఆయన చిత్రం అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సమంత కు సైతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పూర్తి చేసి విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య తాతయ్య, తండ్రితో కలిసి 'మనం'లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. ఈ చిత్రానికి సంభందించి రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


ఫోటోలతో స్లైడ్ షో...

స్టోరీ లైన్ ఏమిటంటే...

స్టోరీ లైన్ ఏమిటంటే...

విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు 'ఆటోనగర్‌ సూర్య' చిత్రంలో చూపించబోతున్నారు.

అనిశ్చితి...

అనిశ్చితి...

'ఏమాయ చేశావే' తర్వాత నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో తయారవుతున్నందున ఈ సినిమాపై సినీ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైనా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో అనిశ్చితి నెలకొని ఉంది. ఆ అనిశ్చితి తొలగి త్వరలోనే 'ఆటోగనర్ సూర్య' ప్రేక్షకుల ముందుకు వస్తాడని అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మెకానిక్ గా ...

మెకానిక్ గా ...

ఈ చిత్రంలో నాగచైతన్య స్కిల్ డ్ మెకానిక్ గా కనిపించనున్నారు. నాగాచైతన్య పాత్ర గురించి వివరిస్తూ... "చైతూ ఈ చిత్రంలో స్కిలెడ్ మెకానిక్ గా కనిపించనున్నారు. పూర్తిగా హీరో సెంట్రిక్ స్క్రిప్టు ఇది. ప్రస్దానం కన్నా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అన్నారు. ఇక దేవకట్టాకు డైలాగ్స్ విషయంలో మంచి గ్రిప్ ఉందని గతంలో ప్రస్దానం నిరూపించింది. ఆ చిత్రంలో లోతైన భావమున్న డైలాగులుకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ చిత్రకు మొదట ఆడియో టీజర్ విడుదల చేసి మరీ క్రేజ్ క్రియేట్ చేసారు" అన్నారు.

నిర్మాత మీడియాకు తెలియచేస్తూ...

నిర్మాత మీడియాకు తెలియచేస్తూ...

దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం అని వివరించారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ దేవాకట్టా చెప్పిన కథ చాలా బాగుంది. నా పాత్ర అద్భుతంగా మలచడానికి ఆయన ప్రయత్నిస్తుండడంతో నేను ఈ చిత్రానికి చేయడానికి పూనుకున్నాను. హీరోగా నాకు మంచి చిత్రం అవుతుంది, అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అని తెలిపారు.

బ్యాలెన్స్ షూట్...

బ్యాలెన్స్ షూట్...

దాదాపు సంవత్సరం తర్వాత నాగ చైతన్య ... ‘ఆటోనగర్ సూర్య' ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దాదాపు తొంభై శాతం పూర్తైన తర్వాత ఆర్.ఆర్ వెంకట్...షూటింగ్ ఆర్దిక కారణాల వల్ల ఆపుచేసేసారు. అందరూ ఈ సినిమా ఆగిపోయిందనుకున్నారు. కానీ సెప్టెంబర్ 10 నుంచి షూటింగ్ మొదలెడుతున్నారు. ‘ఆటో నగర్ సూర్య' టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంబందించిన రెండు పాటల చిత్రీకరణ మాత్రమే ఇంకా మిగిలి ఉంది.

సాయికుమార్ ముఖ్యపాత్రలో

సాయికుమార్ ముఖ్యపాత్రలో

యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈ చిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్దానం చిత్రంలో కూడా సాయికుమార్ కీలకమైన పాత్ర చేసారు.

డైలాగులు...

డైలాగులు...

"చూడు బాబాయ్ కొట్టుకు చావటానికి మన మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు,

భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కడికి ఒక హక్కు ఉంది ...తెలిసిన పని చేసుకుంటూ అడగడమ్...కానీ ఆ హక్కుని కబ్డా చేసుకుంటూ అడగడమ్ నీ హక్కు అనుకుంటున్నా..

హిస్టరీ లో జరిగిన ప్రతీ పోరాటానికి,యుద్దానికి ఇదే కారణం...

అవును బాబాయ్ నేను అనాధనే కానీ అనామకుడ్ని కాదు నా పేరు సూర్య...ఆటో నగర్ సూర్య..."

డిఫెరెంట్ షేడ్స్...

డిఫెరెంట్ షేడ్స్...

హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్తున్నారు.

లేటెస్ట్ అప్ డేట్స్...

లేటెస్ట్ అప్ డేట్స్...

అచ్చి రెడ్డి మాట్లాడుతూ..." కేవలం రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఒక పాటను మలేషియాలో చిత్రీకరిస్తున్నాం. దీపావళి కి ఈ సినిమాని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. ," అన్నారు.

కెరీర్ మొదలైంది...

కెరీర్ మొదలైంది...

నాగచైతన్య కి తడాఖా చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దాంతో ఈ చిత్రం బిజినెస్ పరంగానూ బాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. అందులోనూ యాక్షన్ సబ్జెక్టు కావటం కూడా సినిమాకు ప్లస్ అయ్యే అంశం.

సమంత క్రేజ్

సమంత క్రేజ్

ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత హవా నడుస్తోంది. ఆమె సినిమా అంటే వెంటనే బిజినెస్ అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని మళ్లీ మొదలుపెడుతున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

‘ఆటోనగర్ సూర్య’

‘ఆటోనగర్ సూర్య’

మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి. నాగచైతన్య, సమంత జంటగా రూపొందుతోన్న 'ఆటోనగర్ సూర్య' చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ' సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.ఆటో నగర్ సూర్య చిత్రంలో సమంత హీరోయిన్. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెన్నెల', 'ప్రస్థానం' చిత్రాలతో అందరి ప్రశంసలూ పొందిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకుడు.

English summary
Naga Chaitanya's Auto Nagar Surya Film explores the inside story of Vijayawada rowdyism. After delivering Prasthanam, Deva Katta pens the story, dialogues and directs the film Autonagar Surya amidst high expectations. The film will see Samantha playing the female lead for the second time opposite Chaitu. Music is composed by Anoop Rubens.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu