»   » హాలీవుడ్ చిత్రం ప్రేరణతో నాగచైతన్య 'దోచేయ్‌' ?

హాలీవుడ్ చిత్రం ప్రేరణతో నాగచైతన్య 'దోచేయ్‌' ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:అక్కినేని నటవారసుడు నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి ‘దోచెయ్‌' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే వదిలారు. ‘స్వామిరారా' ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం హాలీవుడ్ లో వచ్చిన ఓషన్స్ 11 (2001), తర్వాత ఇదే సీరిస్ లో వచ్చిన ఓషన్స్ 12, 13 ల నుంచి ప్రేరణ పొంది చిత్రం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గతంలోనూ‘స్వామిరారా' చిత్రం చాలా చిత్రాల నుంచి ప్రేరణ పొంది రూపొందించినట్లు స్వయంగా ప్రకటించిన సుధీర్ వర్మ...ఈ చిత్రంలోనూ అదే దారిలో చాలా సినిమాల నుంచి సీన్స్, షాట్స్ తీసుకుని చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సారి కూడా మొదట్లో... నాకు నచ్చిన చాలా సినిమాల నుంచి తీసుకున్న సీన్లతో చేసిన కథ అని వేస్తారని భావిస్తున్నారు. ఇదంతా నిజమో కాదో తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే.

Naga Chaitanya’s Dochey inspired from Hollywood?

ఈ చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడట. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. అందుకే దీనికి ‘దోచెయ్‌' అనే టైటిల్‌ ను పెట్టారు.

తాను మోసపోకూడదంటే... ఎదుటివాళ్లను మోసం చేయడమే మార్గం అనేది ఆ యువకుడు నమ్మిన సిద్ధాంతం. దొరికితే చాలు... దోచేయడానికి సిద్ధపడే అతడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'దోచేయ్‌'. నాగచైతన్య, కృతిసనన్‌ జంటగా నటిస్తున్నారు. సుధీర్‌ వర్మ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ''అడుగడుగునా ఆసక్తిని రేకెత్తించే కథ, కథనాలతో సాగే చిత్రమిది. నాగచైతన్య నటన ఆకట్టుకుంటుంది. ఇందులో ఛేజింగ్‌ సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. 'స్వామి రారా'తర్వాత సుధీర్‌వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది''అని నిర్మాతలు తెలిపారు.

''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
The latest buzz from film nagar sources is that Naga Chaitanya’s Dochey movie inspired from Hollywood Movie..Ocean's Eleven. It's release date has been confirmed. The makers of this film announced the release date as April 17th and they are making plans to release the movie worldwide on the same day.
Please Wait while comments are loading...