»   » నాగచైతన్య 'దుర్గ' ఆగిపోయినట్లే

నాగచైతన్య 'దుర్గ' ఆగిపోయినట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగచైతన్య,హన్సిక జంటగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో 'దుర్గ' చిత్రం మొన్నా మధ్య అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగిపోయిందని సమాచారం. దాదాపు ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అని తెలుస్తోంది. కారణాలు ఏమిటనేది మాత్రం తెలిసిరాలేదు. ఈ కథ మీద చాలా కాలం వర్క్ చేసారు. అయితే నాగచైతన్యకు అనుకున్నవిధంగా స్క్రిప్టు రాలేదని అందుకే ఆగిపోయిందని అంటున్నారు. శ్రీ శుభ శ్వేత ఫిలింస్ పతాకంపై సి.కళ్యాణ్ సమర్ఫణలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన పిల్లలు వరుణ్-శ్వేతలాన నిర్మాతలుగా పరిచయమవుతున్నారు.

తడాఖా'తో మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా 'మనం' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని ఈ నెల్లోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Naga Chaitanya's Durga shelved

ఇదిలావుంటే... నాగచైతన్య ఇప్పుడు మరో రీమేక్‌ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. పంజాబీలో విజయవంతమైన 'సింగ్‌ వర్సెస్‌ కౌర్‌' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. అందులో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తారు. మొదట ఈ చిత్రంలో రానా నటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ కథరీత్యా చైతన్య అయితేనే బాగుంటుందని నిర్ణయించారు. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మాత డి.రామానాయుడు తెలిపారు.

నాగచైతన్య హీరో గా విజయ్‌కుమార్‌ కొండ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. చిత్రప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి 'ఒక లైలా కోసం' అనే పేరుని పరిశీలిస్తున్నారు.

English summary

 Naga Chaitanya's recently launched Durga movie has been shelved due to unknown reasons. This film was launched with Srinivas Reddy wielding the mega phone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu