»   »  ఏ సీన్ ఎక్కడ నుంచి లేపేస్తాడో అనే భయం

ఏ సీన్ ఎక్కడ నుంచి లేపేస్తాడో అనే భయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాకు నచ్చిన ప్రతీ చిత్రం నుంచి నేను కాపీ కొడతాను అంటూ టైటిల్స్ కు ముందే వేసుకుని ధైర్యంగా సీన్స్ కాపీ కొట్టి మరీ హిట్ కొట్టిన దర్శకుడు సుధీర్ వర్మ. రకరకాల హాలీవుడ్ చిత్రాల నుంచి షాట్స్, సీన్స్ ఎత్తేసి, స్టోరీ లైన్ ను...అంతకు ముందే హిందిలో హిట్టైన డిల్లీ బెల్లీ నుంచి తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మరో చిత్రం నాగ చైతన్య తో చేస్తున్నాడు. దాంతో ఈ సారి ఏ సినిమాలనుంచి ఎత్తేస్తాడో...తాము ఆల్రెడీ ఎత్తుదామని పెట్టుకున్న సీన్స్ ని లేపేస్తాడేమో అని అప్ కమింగ్, ఆల్రెడీ ట్రైల్స్ లో ఉన్న దర్శకులలో భయం మొదలైంది.

'స్వామి రా రా' అంటూ తొలి ప్రయత్నంతోనే ఆకట్టుకొన్నారు సుధీర్‌ వర్మ. 'తడాఖా', 'మనం'... అంటూ విజయాల బాట పట్టారు నాగచైతన్య. వీరిద్దరూ మరో విజయం కోసం జట్టు కట్టారు. నాగచైతన్య కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతిసనన్‌ నాయిక. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.

Naga Chaitanya-Sudheer Varma movie launched

నాగచైతన్య మాట్లాడుతూ ''సుధీర్‌ వర్మ తీసిన 'స్వామి రా రా' నాకు బాగా నచ్చింది. నా కోసం ఓ మంచి కథ సిద్ధం చేశాడు. తప్పకుండా నా కెరీర్‌లో మంచి చిత్రంగా మిగులుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఈ కథ నాగచైతన్యకు అన్నివిధాలా సరిగ్గా సరిపోతుంది. అన్ని వాణిజ్య అంశాలూ ఉన్నాయి''అన్నారు. ''అత్తారింటికి దారేది' తరవాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. జులై 2 నుంచి రెగ్యులర్‌ షూటింట్‌ ప్రారంభిస్తున్నాము''అని నిర్మాత చెప్పారు.

బ్రహ్మానందం, రవిబాబు, రావురమేష్‌, ప్రవీణ్‌, పూజ, సత్య తదితరులు నటిస్తున్నారు. సంగీతం: సన్నీ ఎమ్‌.ఆర్‌, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌, కళ: నారాయణరెడ్డి, సాహిత్యం: శ్రీమణి, సమర్పణ: బాపినీడు.బి.

English summary
Naga Chaitanya, who is revelling in the huge success of 'Manam' will be acting in a film to be produced by B.V.S.N.Prasad. Sudheer Varma of 'Swamy Ra Ra' fame will helm this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu