»   » నాగ చైతన్య 'ఏమాయ చేసావె' స్టోరీ లైన్ ...

నాగ చైతన్య 'ఏమాయ చేసావె' స్టోరీ లైన్ ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య హీరోగా గౌతం మీనన్ రూపొందించిన 'ఏమాయ చేసావె' చిత్రం రేపు శుక్రవారం అంతటా రిలీజవుతోంది. దాంతో ఈ చిత్రం కథపై రకరకాల టాక్ లు బయిట వినపడుతోంది. ఫిలిం సర్కిల్స్ లో ఎక్కువుగా వినపడుతున్న దాన్ని బట్టి...ఈ కథలో నాగచైతన్య పేరు కార్తీక్. ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాల్లో దర్శకుడు అవుదామని ట్రైల్స్ వేస్తూంటాడు.అయితే కార్తీక్ తండ్రికి ఇష్టముండదు. ఇక ఈ విషయం తెలుసుకున్న మిత్రుడు కృష్ణుడు తనకున్న తెలిసున్న వారి ద్వారా దర్శకుడు పూరీ జగన్నాథ్ కు పరిచయం చేస్తాడు. పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కార్తీక్ చేరుతాడు.

ఈ కథ ఇలా జరుగుతూంటే కార్తీక్..ఐటి కంపెనీలో పనేచేస్తున్న పక్కింటమ్మాయి జెస్సీతో పరిచయం అవుతుంది. మళయాళి క్రిస్టియన్ ఆమె. ఆ పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారుతుంది.అయితే ఇక్కడో ఇబ్బంది ఉంటుంది. కార్తీక్ ప్రేమిస్తున్న అమ్మాయి కంటే రెండేళ్ళు వయస్సు తక్కువుగా ఉంటాడు. దాంతో పెద్దల ఒప్పుకోరు. అప్పుడు కార్తీక్ ఏం చేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు అనేది మిగతా కథ. ఇక ఈ చిత్రాన్ని త్రిష, శింబులతో తమిళంలో రూపొందించి అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు గౌతమ్ ఈ చిత్రానికి రెండు క్లైమాక్స్ లు రెడీ చేసారనే ఓ టాక్ వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu