For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Niharika భర్త వివాదంలోకి నాగబాబు ఎంట్రీ.. అల్లుడి కోసం మనుషులను పంపి.. సింపుల్ ప్లాన్!

  |

  మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ పై పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్నారని కొంత మంది అపార్ట్మెంట్ జనాలు కేసు నమోదు చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ విషయంపై గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఎట్టకేలకు చైతన్య కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అంతా ప్రశాంతగానే ఉందని కూడా తెలిపారు. అంతే కాకుండా తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించారనే నెపంతో స్థానికుల పై మరో కేసు కూడా నమోదు చేశాడని వార్తలు వచ్చాయి. ఇక నాగబాబు కూడా అల్లుడు విషయాన్ని పర్సనల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

  తరచూ అక్కడ న్యూసెన్స్

  తరచూ అక్కడ న్యూసెన్స్

  చైతన్య జొన్నలగడ్డ గత ఏడాది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహరికన్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిహారిక మార్చిలో ఫిల్మ్‌నగర్ - షేక్‌పేట్ రోడ్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అంతకుముందు కుటుంబ సభ్యులతో ఉన్న ఈ కొత్తజంట ఆ తర్వాత కొత్త ఫ్లాట్ లో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కువగా వారి ఆఫీస్ కార్యకలాపాల కోసం ఫ్లాట్ కు జనాలు వస్తూ ఉంటారు. తరచూ అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేశారు. మీడియాలో కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

  పెద్ద సంఖ్యలో జనాలను తీసుకురావడంతో

  పెద్ద సంఖ్యలో జనాలను తీసుకురావడంతో

  అయితే ఇటీవల న్యూసెన్స్ చేస్తున్నారని అపార్ట్‌మెంట్ భవనం నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెగా అల్లుడు ఇబ్బందుల్లో పడ్డాడు. అతను తన ఫ్లాట్‌కు పెద్ద సంఖ్యలో జనాలను తీసుకురావడంతో తమకు అసౌకర్యంగా ఉందని, అలాగే రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా అతను ఇబ్బందిని సృష్టిస్తున్నాడని వారు ఆరోపించారు. అపార్ట్ మెంట్ లో ఉన్న కొందరు చైతన్య చిన్న గడ్డపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విషయం ఒక్కసారిగా మీడియాలో వైరల్ అయింది. అయితే చైతన్య కూడా అందుకు ప్రతీకారంగా, తన గోప్యతను ఉల్లంఘించినందుకు వారిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే మరో కేసు కూడా వేశాడు.

  రంగంలోకి నాగబాబు?

  రంగంలోకి నాగబాబు?

  ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత, నాగ బాబు అల్లుడి కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నాగబాబు తన మనుషులను అపార్ట్‌మెంట్ నివాసులతో మాట్లాడటానికి పంపినట్లు సమాచారం. వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారని పర్సనల్ గా ఫోన్ లో కూడా మాట్లాడినట్లు టాక్ వస్తోంది. చివరగా జరిగిన రెండు పార్టీలు కారణంగా తోటివారు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడినట్లు నాగబాబుకు తెలియజేశారని సమాచారం. వీలైనంత వరకు ఎలాంటి గొడవలు జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి నాగబాబు ఉ వారితో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

  తొందరగానే పరిష్కారం అయ్యేలా..

  తొందరగానే పరిష్కారం అయ్యేలా..

  అలాగే వారు ఫిర్యాదులను ఉపసంహరించుకునే ఈ విధంగా కూడా చర్చలు జరుపుతున్నారట. చైతన్య జొన్నల గడ్డ గుంటూరు ఐజి ప్రభాకర్ రావు కుమారుడు. బహుశా, అతని తండ్రి ప్రభావం వలన కూడా ఈ సమస్య తొందరగానే పరిష్కారం కావచ్చని తెలుస్తోంది. ఇక చైతన్య జొన్నలగడ్డ కూడా ఈ వివాదంపై వెంటనే సోషల్ మీడియా ద్వారా తన వివరణ ఇచ్చాడు.

  క్లారిటీ ఇచ్చిన చైతన్య

  క్లారిటీ ఇచ్చిన చైతన్య

  అసలైతే ముందుగా అపార్ట్మెంట్ లో జరిగిన గొడవ పై నేను ఫిర్యాదు చేశానని చెబుతూ.. ముందుగా మీడియాలో తన పేరు కూడా రాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పాతికమంది మా ఫ్లాట్ డోర్ బాదడం వల్లనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అనంతరం మా ఫ్లాట్ ఓనర్ కూడా నేను ఆ విషయాన్ని చెప్పాను. అయితే ఈ ఫ్లాట్ తీసుకోవడానికి గల కారణాన్ని నేను చెప్పాను గాని అపార్ట్మెంట్ వాసులకు చెప్పలేదు అని చైతన్య ఒక వివరణ ఇచ్చాడు. ఓనర్ కు మాత్రమే కమర్షియల్ ఆఫీస్ పెట్టుకున్నామని ముందుగానే వివరణ ఇచ్చాను. ప్రస్తుతానికి తమ మధ్య ఎలాంటి విభేదాలు గాని గొడవలు గాని లేవు ఈనెల 10వ తేదీకి ఫ్లాట్ కానీ చేయబోతున్నాం అని కూడా చైతన్య జొన్నలగడ్డ వివరణ ఇచ్చాడు.

  భార్య ప్రొడక్షన్ హౌస్ లో సభ్యుడిగా

  భార్య ప్రొడక్షన్ హౌస్ లో సభ్యుడిగా

  గత ఏడాది డిసెంబర్లో చైతన్య నిహారికల పెళ్లి రాజస్థాన్ లోని ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ కు వెడ్డింగ్ కు మెగా కుటుంబ సభ్యులు మొత్తం హాజరైన విషయం తెలిసిందే. ఇక పెళ్లి అనంతరం నిహారిక వెబ్ సిరీస్ లతో బిజీగా మారింది. అలాగే ప్రొడక్షన్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా భార్య ప్రొడక్షన్ హౌస్ లో సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

  Megaatar Chiranjeevi Daughter To Debut In Tamil Remake | సక్సెస్ అవుతుందా?
  ఆ రూట్లో చైతన్య ఎంత వరకు సక్సెస్ అవుతాడో ?

  ఆ రూట్లో చైతన్య ఎంత వరకు సక్సెస్ అవుతాడో ?

  మరోవైపు చైతన్య హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అతను ఆ విషయంపై స్పందించింది లేదు. అతనికి ఇంట్రెస్ట్ కూడా లేదని తెలుస్తోంది. ఎక్కువగా ప్రొడక్షన్ వైపు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి ఆ రూట్లో చైతన్య ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఇక రెగ్యులర్ గా మ్యారేజ్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. నిహారిక కూడా తన భర్త కు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.

  English summary
  Nagababu special focus on son in law police case. Even the little things about movie celebrities in general are interesting to the common man. Similarly, a police case has been registered against mega daughter Niharika's husband Jonnalagadda Chaitanya, who recently got married. finally Jonnalagadda Chaitanya opened his mouth on the subject, going into the details of it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X