For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కాంప్రమైజ్ అయ్యేదే' లేదంటున్న చైతూ.. ఆమెకు పరోక్ష కౌంటరేనా?

  |

  ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత జంట గత ఏడాది అక్టోబర్ లో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ జంట ఈ ప్రకటన చేసినప్పటి నుంచి వారిద్దరి గురించి అనేక రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా వారు ఏం చేస్తున్నా దానికి సోషల్ మీడియాలో, మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. అయితే నాగచైతన్య తాజాగా నటిస్తున్న థాంక్యూ సినిమా టీజర్ విడుదల కాగా అందులో ఒక డైలాగ్ ఇప్పుడు తన మాజీ భార్య సమంతను ఉద్దేశించిందే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

   వరుస విజయాలు

  వరుస విజయాలు


  నాగచైతన్య గత ఏడాది నుంచి వరుస విజయాలు అందుకుంటున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఆ సినిమాలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షుకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తన తండ్రి నాగార్జునతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేసిన బంగార్రాజు సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై అది కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

  ప్రమోషన్స్ మీద

  ప్రమోషన్స్ మీద


  ఇక నాగచైతన్య ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన సినిమా థాంక్యూ.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మీద దర్శక నిర్మాతల దృష్టి పెట్టారు. అందులో భాగంగా తాజాగా థాంక్యూ సినిమా టీజర్ విడుదల చేశారు. 'నా స‌క్సెస్‌కు కేవ‌లం కార‌ణం నేనే..అంటూ చైతూ చెబుతున్న సంభాష‌ణ‌ల‌తో మొద‌లైంది టీజ‌ర్‌.

  సమంతను ఉద్దేశించి

  సమంతను ఉద్దేశించి


  మీరు త‌ప్ప మీ లైఫ్‌లో ఇంకొక్క‌రికి చోటే లేదు అని రాశీఖ‌న్నా అంటోంది. లైఫ్‌లో ఇంక కాంప్ర‌మైజ్ అయ్యేదే లేదు ఎన్నో వ‌దులుకొని ఇక్క‌డికొచ్చానంటూ చైతూ చెప్పిన డైలాగ్ ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. నిజానికి చైతన్య-సమంత విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇద్దరి అభిమానులు రెండుగా విడిపోయి ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు చైతన్య ఫ్యాన్స్ వంతు రావడంతో ఇది మా వాడు సమంతను ఉద్దేశించి చేసిన కామెంట్ అన్నట్టు సోషల్ మీడియాలో బిల్డప్ ఇస్తున్నారు.

   తీవ్ర గందరగోళంలో

  తీవ్ర గందరగోళంలో


  ఈ డైలాగ్ సమంతకు గట్టి చెంపదెబ్బలా అనిపిస్తోందని కొందరు హార్డ్ కోర్ చైతన్య అభిమానులు సోషల్ మీడియాలో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. తీవ్ర గందరగోళంలో సమంత చైతన్యను విడిచిపెట్టిందని చైతన్య అభిమానులు భావిస్తున్నారు. అభిమానులు తమ అభిమాన హీరోహీరోయిన్లను వెనకేసుకు రావడం కోసం ఏమాత్ర్రం లాజిక్‌ల కోసం వెతకరని ఈ వ్యవహారం మరోసారి రుజువు చేసింది.

  ఏమని అంటారో

  ఏమని అంటారో


  ఇక ఈ థాంక్యూ సినిమాలో మాళ‌వికా నాయ‌క్‌, అవికాగోర్‌, రాశీఖ‌న్నాతో డిఫ‌రెంట్ షేడ్స్ లో చైతూ ల‌వ్ ట్రాక్ న‌డిపించ‌బోతున్నాడ‌ని టీజ‌ర్‌తో క్లారిటీ వచ్చింది. మరి ఈ అంశం మీద సమంత అభిమానులు ఏమని అంటారో వేచి చూడాలి మరి.

  English summary
  as per social media buzz, nagachaitanya thank you movie teaser Dialogue Targeted His Ex-wife samantha
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X