Nagarjuna 100th Film: అక్కినేని నాగార్జున 100వ చిత్రం టైటిట్.. కీలక పాత్రల్లో చైతూ, అఖిల్
టాలీవుడ్ సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున ఇప్పటికీ భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఆరు పదుల వయస్సు దాటినా యంగ్ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు నాగార్జున తన కెరీర్ లో 99 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. ఇక నాగార్జున నుంచి 100వ చిత్రం ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో Nagarjuna 100th film పై ఇంట్రెస్టింగ్ వివరాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా అక్కినేని నాగార్జున కోలీవుడ్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కూలీ చిత్రంతో అలరించారు. ఇండియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో విలన్ గా నాగార్జున నటించడం విశేషంగా మారింది. నాగార్జున కెరీయర్ లోనే తొలిసారిగా ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో నటించారు. తన స్టైలిష్ లుక్, మాస్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. ఆగస్టు 14న పాన్ ఇండియా ఫిల్మ్ గా వరల్డ్ వైడ్ గా విడుదలైంది.

అయితే కూలీ చిత్రంతోనూ నాగార్జున అభిమానులు సాటిస్ఫై కాలేకపోయారు. దీంతో నెక్ట్స్ నాగార్జున నుంచి రాబోయే 100వ చిత్రం కోసం ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాగార్జున 100వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? నిర్మాత ఎవరు? స్టార్ కాస్ట్ ఎవరు ఉండబోతున్నారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో నాగార్జున కెరీర్ లోని స్పెషల్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తుండటం విశేషం. ఇక ఆ వివరాల్లోకి వెళితే..
నాగార్జున ప్రస్తుతం పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన సమయంలో తన 100వ చిత్రంపై ఫోకస్ పెట్టారంట. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు రా కార్తీక్ డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కించే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు నాగార్జున 100వ చిత్రానికి కింగ్100 అనే టైటిల్ ను ప్రాథమికంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ లో నాగార్జున కొడుకులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ కూడా క్యామియో రోల్ లో నటించడం ఖాయమని, వారికి సంబంధించిన పాత్రలు ఉండేలా కథను ఎంపిక చేసే పనిలో నాగార్జున ఉన్నారని అంటున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ మూడు తరాలు మనం అనే చిత్రంలో వెండితెరపై అలరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఫిల్మ్ టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మళ్లీ రిపీట్ అవ్వడం కష్టమని అంటున్నారు. ఇక నాగ్ 100వ చిత్రం కూడా అలానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట.


Click it and Unblock the Notifications











