»   » నాగ్, రాఘవేంద్రరావు కొత్త చిత్రం టైటిల్

నాగ్, రాఘవేంద్రరావు కొత్త చిత్రం టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో మరో చిత్రం ప్లానింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా డివోషనల్ ఫిల్మ్ నే ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ హీరోగా పేరున్న నాగార్జున ని రాఘవేంద్రరావు..అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి చిత్రాలతో డిఫెంరెట్ గా చూపించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే జరుగుతోంది.

తాజాగా అందుతున్న సమచారం ప్రకారం ఈ కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి పై ఓ కథను రెడీ చేసారు. ఈ సినిమాలో నాగార్జున హాథీరాం బాబా గా కనిపించనున్నారు. అలాగే వెంకటేశ్వరస్వామిగా సుమన్ కనిపించనున్నారు.

Nagarjuna and Raghavendra Rao film titled?

ఇక ఈ చిత్రానికి నమో వెంకటేశాయ అనే టైటిల్ ని ఖరారు చేసి రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి ఇప్పటికే పాటలను రెడీ చేసే పనిలో పడ్డారు. షిర్డీ శాయి చిత్రం నిర్మించిన మహేశ్వరెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. మే నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ద్వారా తెలియనున్నాయి.

English summary
Nagarjuna and K. Raghavendra Rao are working together for a devotional film again. The title Om Namo Venkateshaya was also registered in the film chamber for this flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu