Just In
- 4 min ago
Box office: 6వ రోజు అల్లుడు అదుర్స్ డౌన్.. రెడ్ సినిమాకు వచ్చింది ఎంతంటే?
- 42 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 53 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
- 1 hr ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
Don't Miss!
- News
బైడెన్ ఇనాగురల్ స్పీచ్ వెనుక తెలంగాణ మాస్టర్ మైండ్.. ఆ ప్రసంగాన్ని డ్రాఫ్ట్ చేసింది మనోడే...
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Automobiles
భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఆత్మ' పాత్రలో నాగార్జున రొమాన్స్, సలహాలు
హైదరాబాద్ :నాగార్జున త్వరలో ఆత్మగా కనిపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. ఆ పాత్ర తో ఫన్ వస్తుందని...ఆ పాత్ర స్వర్గం నుంచి తన మనవడు(ఇంకో నాగార్జున) కోసం వస్తుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. ఆ పాత్ర ..రొమాంటిక్ గా మన్మధుడు లా ప్లే బోయ్ టచ్ తో నడుస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఉండే అమాయిక నాగార్జున కు ఆ పాత్ర వచ్చి అమ్మాయిలు విషయాల్లో సలహాలు ఇస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇదంతా ఏ చిత్రంలోనా అంటారా... 'సోగ్గాడే చిన్ని నాయనా' లోది. ఈ పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని అంటున్నారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చిత్రం విశేషాలకు వస్తే...
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. లావణ్య త్రిపాఠి కథానాయిక. రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం మైసూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.
లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.
''వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. నాగార్జున ప్రయాణంలో మరొక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది''ని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బ్రహ్మానందం, హంసానందిని, చలపతిరావు, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, సంగీతం: అనూప్ రూబెన్స్