»   » నాగార్జున ‘భాయ్’ కథ ఇదేనా?

నాగార్జున ‘భాయ్’ కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో పక్కా మాస్ పాత్రలో నాగార్జున కనువిందుచెయ్యనున్నారు. వీరభద్రం చౌదరి దర్శకుడు. రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. ఈ చిత్రాన్ని రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదలచెయ్యనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

ఈ చిత్రం కథ అంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. అదేమిటంటే..విజయ్ (నాగార్జున) ఓప్రొఫిషనల్ కిల్లర్. దుబాయిలో ఉండే డాన్ నుంచి అతనికో వర్క్ వస్తుంది. పోలీస్ అధికారి శ్యామ్ (కిక్ ఫేమ్)ని చంపమని సుపారి వస్తుంది. దానికోసం అతను హైదరాబాద్ బయిలుదేరి వస్తాడు. వచ్చాక అతను భాయ్ గా పేరు మార్చుకుని తన ఆపరేషన్ రహస్యంగా మొదలుపెడతాడు. ఈ క్రమంలో భాయ్...రిచాని ఓ కామన్ ప్రెండ్ పెళ్లిలో చూసి ప్రేమలో పడతాడు. కానీ అతని ఐడింటిటీ చెప్పడు. ఇక శ్యామ్ ని అతని పెళ్లిలోనే చంపేయలని వెళతాడు. అయితే అక్కడో ట్విస్ట్. అక్కడ భాయ్ తన తండ్రిని చూస్తాడు. తన తమ్ముడు శ్యామ్ అని అర్దం చేసుకుంటాడు. దాంతో శ్యామ్ ని చంపకూడదని డెషిషన్ తీసుకుంటాడు.

అయితే విజయ్ ని అనుసరించి వచ్చిన డాన్ మనుష్యులు...శ్యామ్ మీదకు ఎటాక్ చేసి చంపేయబోతారు. అప్పుడు వారిద్దరినీ చంపేస్తాడు. దాన్ని రిచా చూస్తుంది. ఎవరు నువ్వు విజయ్ ని నిలదీస్తే తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో .. తన విలేజ్ లో తన తండ్రి గ్రామ పెద్ద అని, అతని మీద కక్ష గట్టి వేరే వాళ్లు ఎటాక్ చేయబోతే వారిని చంపేస్తాడు. అప్పుడు పట్టుబడి జైలుకు వెళ్ళతాడు. తన తండ్రి ఇంక ఎప్పుడూ అతని మొహం చూపద్దు అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రొఫిషనల్ కిల్లర్ గా ఎదుగుతాడు. అదీ ఫ్లాష్ బ్యాక్.

ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యేసరికి శ్యామ్ వచ్చి తన అన్న అని తెలియక విజయ్ ని అరెస్టు చేస్తారు. ఈ లోగా డాన్..విజయ్ కు మిగతా వారికి ఉన్న రిలేషన్ తెలుసుకుని విజయ్ కుటుంబం మొత్తం లేపేయాలని ప్లాన్ చేస్తాడు. అప్పుడు విజయ్ ఏం చేసి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడనేది మిగతా కథ. అయితే ఇదే కథ సినిమా లో ఉంటుందా లేదా అన్నది రిలీజయితే కానీ తెలియదు.

'భాయ్' మూవీ తెలుగుతో పాటు తమిళ అనువాదంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలోనూ ఈచిత్రాన్ని 'భాయ్' పేరుతోనే విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

నాగినీడు, జరాసా, వినయప్రసాద్, సంధ్యా, ఝనక్ ప్రసాద్, చలపతి, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, ప్రసన్న, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.

English summary
The story of Nagarjuna's mass entertainer 'Bhai' has gone viral on the web. We don't know if its the real one or a cooked-up story for now. Let's have a look at it…Nagarjuna will be seen in a full fledged mass avatar in this movie. Veerabhadram Chowdhary is the director and Richa Gangopadhyay is the heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu