twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునని ఛాలెంజ్ చేస్తున్న ఎన్టీఆర్

    By Srikanya
    |

    నాగార్జున తాజా చిత్రం 'రాజన్న'ఈ నెల 23న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున ఎన్టీఆర్ గా పేరు మార్చుకున్న నందమూరి తారకరత్న తాజా చిత్రం నందీశ్వరుడు కూడా విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు యాక్షన్ చిత్రాలే కావటంతో వీటి మధ్య పోటి ఉండబోతోందని పరిశీలకులు భావిస్తున్నారు. వరస ఫ్లాఫ్ ల్లో ఉండి,గ్యాప్ తీసుకుని వస్తున్న తారకరత్న ఈ చిత్రంతో తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, చాలా టెర్రిఫిక్ గా ఈ చిత్రం వచ్చిందని చెప్తున్నారు. అదే సమయంలో రాజమౌళి యాక్షన్ ఎపిసోడ్స్ డైరక్ట్ చేసిన రాజన్న పైన కూడా చాలా ఆశలు ఉన్నాయి.

    పిచ్చి కుక్కులను చంపడానికి పిస్తోలు అక్కర్లెద్దు. పిడికిలి చాలు.. ఇలాంటి సంభాషణలు ఈ నందీశ్వరుడులో పరుచూరి బ్రదర్శ్ రాసారు. ఈ సినిమాతో తారకరత్న మాస్‌ కథానాయకుడిగా నిలబడతాడని చెప్తున్నారు.కన్నడంలో 200 రోజులు ఆడిన డెడ్లీసోమను మన నేటివిటీకి అనుగుణంగా మార్చి ఈ కథను తయారు చేశారు. తారకరత్నలో మంచి నటనా పటిమ ఉందని, అది ఈ చిత్రం చూసిన వారు అంటారని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో తారకరత్న పోలీసాఫీసర్‌గా కనిపిస్తాడు. సమాజాన్ని మార్చాడా, లేక తానే మారాడా అనేది ఈ చిత్ర కథాంశం.

    రాజన్న విషయానికి వస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన యధార్ధ గాథ ఆధారంగా తీస్తున్నారు. రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే కథ ఇది. బడుగు, బలహీన వర్గాల ప్రజలపై రజాకారులు సాగించిన అన్యాయాలు, దౌర్జన్యాలపై తిరుగుబాటు చేసి, ప్రజల్లో చైతన్యాన్ని నింపుతాడు రాజన్న. తను ఒక విప్లవకారుడు. రాజన్న పోరాటం రజాకార్లు, దొరలపైన మాత్రమే కాదు.. ప్రతి అన్యాయంపైన. ఎక్కడ అన్యాయం కనిపిస్తే... అక్కడ రాజన్న ఉద్భవిస్తాడు. ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పోరాటం చేస్తాడు.నేలకొండపల్లెలోని గ్రామస్తులకు తన పాట ద్వారా ధైర్యం నూరిపోస్తాడు రాజన్న. పాట ప్రధానంగా సాగే సినిమా కథ ఇది.

    English summary
    Nagarjuna is arriving with his much talked about film 'Rajanna', Tarak Ratna is arriving with his film 'Nandeeswarudu' on the same day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X