For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగ్ 'ఢమరుకం' నిర్మాతపై వాయిదా ఒత్తిడి?

  By Srikanya
  |

  హైదరాబాద్: నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' . ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల చేయనున్నారనే సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు రోజే అంటే అక్టోబర్ 18న పవన్‌కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన 'కెమెరామన్ గంగతో రాంబాబు' చిత్రం అత్యధిక ప్రింట్లతో విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ 'డమరుకం' చిత్రాన్ని వాయిదా వేసుకోమని కోరుతునట్లు సమాచారం. అయితే నిర్మాత వెంకట్ మాత్రం ఫిక్స్ చేసిన తేదీనే విడదల చేయాలని అంటున్నారని, అయితే ఫోస్ట్ ఫోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

  రెండు పెద్ద సినిమాలు కావటంతో ధియోటర్స్ సమస్య వస్తుందని భావిస్తున్నారు. అయితే నాగార్జున దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఆయన ఈ ఇష్యూ పై మాట్లాడుతూ...'సంక్రాంతికి 3, 4 పెద్ద సినిమాలు వస్తుంటాయి. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకొస్తుంది. ఇది దసరా పండుగ సీజన్ కదా. సినిమా నచ్చితే ప్రేక్షకులు ఎన్నయినా చూస్తారు' అన్నారు. దాంతో దర్శక,నిర్మాతలు డైలమోలో పడుతున్నట్లు వినికిడి. ఇండస్ట్రీ పెద్దలు కూడా సంక్రాంతి అంటే మూడు రోజుల పండగ కాబట్టి కలెక్షన్స్ పరంగా ఏ ఇబ్బందీ ఉండదు కానీ,దసరా అనేది నవరాత్రలు అన్నా ఒక్క రోజే కదా గ్రాండ్ గా జరుపుతారు..వాయిదా వేసుకోవటమే బెస్ట్ అని సూచిస్తున్నట్లు సమాచారం.

  దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ తరహా అంశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దాం. మనవైన ఆచారాలు, సంప్రదాయాలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటే వాటిని కాపాడేందుకు ఒకరు ఉద్భవిస్తారనే విషయాన్ని అంతర్లీనంగా ఇందులో చెబుతున్నాం. నాగార్జున నటన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు. నాగార్జున కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా వెంకట్ అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇండియన్ స్క్రీన్‌పై ముందెన్నడూ చూడని విధంగా గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూడొచ్చని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చెప్పారు.


  అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.

  English summary
  producers of the Nagarjuna-Anushka starrer Damarukam are under immense pressure to postpone the release of the film. The reason being to avoid clashing with the release of Pawan Kalyan's Cameraman Ganga tho Rambabu,(CGR) which is scheduled to release on the same day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X