»   » కొనేవారు లేకే నాగార్జున 'గగనం' మళ్ళీ వాయిదా?

కొనేవారు లేకే నాగార్జున 'గగనం' మళ్ళీ వాయిదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున "గగనం" చిత్రం రిలీజ్ మళ్ళీ వాయిదా పడింది. ఈ చిత్రం జనవరి 1వ తేదీకి వాయిదా వేసినట్లు దిల్ రాజు ఆ మధ్య చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు కారణం ఈ చిత్రాన్ని తీసుకోవటానికి ముందుకు ఎవరూ రావటం అని అంతర్గత వర్గాల సమాచారం.ఇక ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు.."హైజాక్‌ నేపథ్యంలో అల్లుకొన్న కథ ఇది. తెలుగులో ఈ తరహా చిత్రం రావడం ఇదే తొలిసారి. ప్రతి సన్నివేశం ఉత్కంఠను కలిగిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించడం వల్ల నిర్మాణపరంగా జాగ్రత్తలు తీసుకొన్నాం. ఇదో ప్రయోగాత్మక చిత్రమే అయినా వాణిజ్య అంశాలు అన్నీ ఉంటాయ"న్నారు. విమానం హైజాక్‌, తదనంతర పరిణామాల నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూనే హాస్యాన్ని పంచుతుంది అన్నారు.

అలాగే గగనంలో తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ...కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్‌ హైజాగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్‌ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్‌ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌ అని చెప్పాలి. మంచి ఎమోషనల్‌ డ్రామా కూడా ఉంది. తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో రానున్నది. ఈ చిత్రంలో కత్తి లో చేసిన సనాఖాన్ ప్రయాణికుల్లా చేస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, కళ: కె.కబీర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu