»   » చైతూ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా.. నాగ్ గ్రీన్ సిగ్నల్!

చైతూ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా.. నాగ్ గ్రీన్ సిగ్నల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో మరో స్టార్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నది. అక్కినేని నాగ చైతన్య, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఈ చిత్రం రాబోతున్నదట. ఈ వార్త ఫిలింనగర్‌తోపాటు, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారమవుతున్నది.

చైతూ, త్రివిక్రమ్ కలయిక అక్టోబర్‌లో..

చైతూ, త్రివిక్రమ్ కలయిక అక్టోబర్‌లో..

ప్రస్తుతం నాగచైతన్య సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. చైతూ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను అక్టోబర్‌లో ప్రారంభించి సంక్రాంతికి రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారట.

నాగార్జున నిర్మాతగా..

నాగార్జున నిర్మాతగా..

ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మించనున్నట్టు సమాచారం. వచ్చే సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలుపాలనే పట్టుదలతో నాగ్ ఉన్నట్టు తెలుస్తున్నది. అధికారికంగా ప్రకటన వెలువడకముందే చైతూ, త్రివిక్రమ్ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

అల్లుడు కాబోతున్న నాగచైతన్య

అల్లుడు కాబోతున్న నాగచైతన్య

'సోగ్గాడే చిన్ని నాయనా' ఫేమ్‌ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రానికి 'అల్లరి అల్లుడు' టైటిల్‌ ఖరారు చేసినట్టు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. గతంలో ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సినిమా టైటిల్‌ ఇది.

నరకాసురుడిగా చైతూ తమిళ పరిశ్రమలోకి

నరకాసురుడిగా చైతూ తమిళ పరిశ్రమలోకి

నరకాసురుడు చిత్రం ద్వారా నాగచైతన్య తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించనున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామితో కలిసి ఆయన ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇటీవల నాగచైతన్యను దర్శకుడు కార్తీక్ కలిసి కథ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలిసింది.

English summary
Naga Chaitanya to act in another Multi starrer Movie. This film is going to direct by Trivikram. Nagarjuna will be the producer for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu