»   » భార్యను కోటీశ్వరిరాలిని చేసేందుకు నాగార్జున అలా..?

భార్యను కోటీశ్వరిరాలిని చేసేందుకు నాగార్జున అలా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సూపర్ హిట్ హిందీ టీవీ కార్యక్రమం 'కౌన్ బనేగా కరోడ్ పతి' తెలుగు వెర్షన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు కార్యక్రమానికి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

'మీలో కోటీశ్వరులు ఎవరు' అనే పేరుతో సాగే ఈ కార్యక్రమం ఏఫ్రిల్ 18వ తేదీ నుండి మాటీవీలో మొదలు కానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొనే తొలి అవకాశం నాగార్జున తన భార్య అమలకు కల్పించారట. తన భార్యను ఈ కార్యక్రమంలో కోటీశ్వరాలిని చేసేందుకు నాగార్జున ప్లాన్ చేసాడని, అందుకే ఆమెకు తొలి అవకాశం ఇచ్చాడనే ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. నోవాటెల్ హోటల్‌లో 'మీలో కోటీశ్వరులు ఎవరు' కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది.

Nagarjuna giving first opportunity to Amala

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ద్వారా....నాగార్జున మంచి ఫ్యాన్సీ ఎమౌంట్ ని రెమ్యునేషన్ గా వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. మాటీవిలో తనకు షేర్స్ ఉన్నా రెమ్యునేషన్ విషయంలో రాజీ పడలేదని తెలుస్తోంది. నలభై ఎపిసోడ్స్ కి గానూ మూడు కోట్లు వరకూ తీసుకుంటున్నారని టీవి వర్గాల సమాచారం.

మరో వైపు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా సినిమాలు నిర్మించడంతో పాటు....పలు తెలుగు సీరియల్స్‌ను కూడా నిర్మిస్తున్నారు. సీరియల్స్ నిర్మాణంలో మంచి లాభాలు ఉండటంతో నాగార్జున ఈ రంగంలోకి దిగారు. "పసుపు కుంకుమ'' "పుట్టింటి పట్టుచీర'' "శశిరేఖా పరిచయం'' వంటి సీరియల్ష్ ఆయన నిర్మిస్తున్నారు.

English summary
Nagarjuna is placing his beloved wife Amala in Hot Seat for the launch of the event ‘Meelo Koteeswarudu Evaru’ . In the event organised at Novotel, Hyderabad, Amala will be sitting in the hot seat. Nagarjuna is giving the first opportunity to become first crore pati in telugu version to his better half Amala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu