»   » కొడుకు కోసం తప్పుతుందా?

కొడుకు కోసం తప్పుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సోగ్గాడే చిన్ని నాయినా చిత్రం ఘన విజయం సాధించటంతో అక్కినేని అభిమనులు పండుగ చేసుకుంటున్నారు. ఆ ఉత్సాహాన్ని కొనసాగించటానికి నాగార్జున త్వరలో ఓ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఆ చిత్రం మరేదో కాదు తన కుమారుడు హీరోగా చేస్తున్న చిత్రం.

మొదటనుంచీ నాగార్జున తన కొడుకు సినిమాలకు సంబందించి చాలా శ్రద్ద తీసుకుంటారు. అందుకోసం ఏం చేయాడానికైనా వెనుకాడరు. ఇప్పుడు కూడా, నాగా చైతన్య ‘మజ్ను' కోసం ఈ చిత్రంలో తళుక్కున మెరవడానికి సిద్దం అవుతున్నారు.

చాలా బిజి షెడ్యూల్ లో ఉన్న నాగార్జున ఒకరోజు షూటింగ్ లో కూడా పాల్గొనడానికి ఒప్పుకున్నాట్టు సమాచారం. గతం లో కూడా మనం సినిమాలో కూడా తన ఫ్యామిలితో కలిసి నటించారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో, అదే సెంటిమెంట్ తో కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నారు.

Nagarjuna guest role in Chaitu's movie

‘మజ్ను' విశేషాలకు వస్తే...

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘మజ్ను'(వర్కింగ్ టైటిల్) మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ప్రేమమ్' సినిమాకి రీమేక్. ‘కార్తికేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

మూడు లవ్ స్టొరీస్ ఉండే ఈ సినిమాలో చైతన్య - శృతి హాసన్ లపైన వచ్చే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ హైలెట్ గా వచ్చిందని చెప్తున్నారు. కంటన్యూ షెడ్యూల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వేసవి చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు 'మజ్ను' అనగానే నాగార్జునే గుర్తుకొస్తారు. విషాదంతో కూడిన ఆ ప్రేమకథా చిత్రంలో నాగార్జున అంతగా ఒదిగిపోయి నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలోని గీతాల్ని ప్రేక్షకులు ఇప్పటికీ పాడుకొంటుంటారు. మరి ఈ 'మజ్ను' ఏం చేస్తాడో చూడాలి.

English summary
Nagarjuna is confirmed to be seen in a cameo role in Naga Chaitanya's ‘Majnu’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu