»   » డ్రగ్స్ గురించి నాగార్జున లెక్చర్-మీకెలా తెలుసంటే ఇంటర్నెట్ మహిమ...!?

డ్రగ్స్ గురించి నాగార్జున లెక్చర్-మీకెలా తెలుసంటే ఇంటర్నెట్ మహిమ...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో చిన్నా చితకా నటులే కాదు పెద్ద తలలు కూడా బయటకు వచ్చేలా ఉన్నాయని మీడియా వర్గాలు ఊహిస్తున్నాయి. డైరెక్ట్ గా పేరు రాయకపోయినా పేపర్లలో ఇచ్చిన హిట్స్ చూస్తే అవి నాగార్జునని ఉద్దేశించినవేననే సంగతి తెలుస్తోందని కొన్ని వెబ్ సైట్స్ లోనూ, పత్రికలలోనూ దర్శనమిస్తున్నాయంటూ వస్తున్న వార్తలకు తనకూ ఎలాంటి సంబందం లేదని,నాగ్ స్పందిస్తూ...

శరీరాన్ని కుళ్లబొడిచే డ్రగ్స్ మత్తులో కొంతమంది తారలు జోగుతున్న నేపధ్యంలో యువసామ్రాట్ నాగార్జునను ఈ అంశంపై కదిలిస్తే పలు విషయాలు చెప్పారు. ప్రాణాలను హరించివేసే కొకైన్ వాడే వ్యక్తుల ముఖాలను చూస్తే వారు ఆ డ్రగ్ వాడారని చెప్పొచ్చని అన్నారు. శరీరానికి హాని చేసే మాదక ద్రవ్యాల జోలికి ఎందుకు వెళతారో తనకైతే అర్థం కాదని వాపోయారు.

డ్రగ్స్ తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ అగుపిస్తాయన్నారు. ముఖ్యంగా లివర్ పాడైపోతుందనీ, తద్వారా శరీర అవయవాల పనీతీరు మందగించి అనారోగ్యం బారిన పడతారన్నారు. ఇవి తీసుకునేవారిలో ఆకలి మందగిస్తుందని చెప్పారు. కొంతమంది డ్రగ్స్ వాడితో ఏదో శరీర వర్చస్సు పెరుగుతుందని అనుకోవడం అంతా అపోహే అనీ, మత్తుమందు వాడితే ఉన్న ఛార్మ్‌ నెస్ పోయి కళావిహీనంగా తయారవుతారన్నారు.

ఇవన్నీ మీకెలా తెలుసు...? అని ప్రశ్నిస్తే..'అరే.. మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారండీ బాబు. ఇంటర్నెట్‌ లో దీనిపై బోల్డు సమాచారం దొరుకుతుంది. అవి మనిషి ఆరోగ్యంపై చూపే అవలక్షణాల చిట్టా పెద్ద ఎత్తున దర్శనమిస్తుంది. నేను చెప్పింది వాటిలో ఒకటో.. రెండో అంతే..." అన్నారు.

అదిసరే..మీ ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగితే...'ఏముందండీ.. రోజుకో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తాను. ఒకరోజు వ్యాయామం చేస్తాను. మరొక రోజు యోగా చేస్తాను. ఇంకో రోజు ఈత కొడతాను. క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లను పాటిస్తాను. ఇవన్నీ మా నాన్నగారు చెప్పిన ఆరోగ్య సూత్రాలు. వాటినే నేను పాటిస్తున్నా. సో.. ఆ రహస్య సూత్రం మా నాన్నగారిదే" అని చెప్పారు నాగ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu