»   » నాగార్జున నెక్ట్స్ చిత్రం ఆ కామిడి డైరక్టర్ తో...

నాగార్జున నెక్ట్స్ చిత్రం ఆ కామిడి డైరక్టర్ తో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున త్వరలో కామిడీ చిత్రాలతో పాపులరైన శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని, శ్రీనివాస రెడ్డి కామిడీ స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకుని స్క్రిప్టు వర్క్ చేయిస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రస్తుతం నాగార్జున..బిందాస్ దర్శకుడు వీరూ పోట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అనూష్క హీరోయిన్ గా చేసే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో గగనం అనే చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఇక శ్రీనివాస రెడ్డి అఆఇఈ,కుబేరులు వంటి చిత్రాల పరాజయంతో రీసెంట్ గా జోరు తగ్గింది. అలాగే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు రవితేజ హీరోగా గోపీచంద్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ డాన్ శ్రీను అనే చిత్రం చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu