twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ఢమురకం కి మూలం అదా?

    By Srikanya
    |

    నాగార్జున,అనూష్క కాంబినేషన్ లో రూపొందుతున్న ఢమరకం చిత్రానికి ఇంగ్లీష్ లో వచ్చిన ఇమ్మోరటల్స్ ఆఫ్ మలోహా అనే పుస్తకం నుంచి ప్రేరణ పొంది కథ తయారు చేసుకున్నట్లు చెప్తున్నారు. అమీష్ త్రిపాఠి రాసిన ఈ పుస్తకం ఓ ట్రయాలజిగా సాగుతుంది. ఆ పుస్తకంలో ఒకప్పుడు దేముళ్ళందరూ మనుష్యులే అని,వాళ్ళ చేసిన మంచి పనుల వల్ల దేముళ్ళ అయ్యారని సాగుతుంది. దీంట్లోంచి మెయిన్ పాయింట్ తీసుకుని ఈ కథ తయారు చేసినట్లు తెలుగు సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది.

    ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Nagarjuna ‘Damarukam’ has taken a strong lead from the famous book ‘Immortals Of Meluha’. Written by the famous Amish Tripathi, it is a trilogy which runs on the essence of Shiva and the concept is that all gods were once human beings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X