twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ 'ఢమురకం' లీకెడ్ స్టోరీ

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రానికి ఓ రేంజిలో బిజినెస్ కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఓవర్ సీస్ రైట్స్ ని హరి వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు తీసుకున్నారు. నాగార్జున తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావటం,వరస విజయాలతో దూసుకు పోతున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మాత కావంట సినిమాకు డిమాండ్ తెచ్చి పెట్టింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ లీక్ అంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కథని ఈ కథనం గుర్తు చేస్తోంది.

    ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న కథ ప్రకారం... ఈ చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా కనిపిస్తారు. అనూష్క సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది. దైవాంసగా పుట్టిన అనూష్కను చంపటానికి కొందరు అఘోరాలు తీవ్రంగా ప్రయత్నిస్తూంటారు. మరో ప్రక్క ఆమెను వివాహం చేసుకుని దైవ శక్తులను సొంతం చేసుకోవాలని విలన్ ప్రయత్నిస్తూంటాడు. ఈ నేపధ్యంలో ఆమె భాధ్యత తీసుకున్న నాగార్జున ఎలా ఆమెను రక్షించాడు అన్న యాంగిల్ లో కథ నడుస్తుంది. మరో ప్రక్క శివుడు భూమి మీదకు రావటం జరుగుతుంది. ఆయనంటే హీరోకు పడదు. చివరకు దుష్ట శక్తుల నుంచి అనూష్కని కాపాడి దైవ శక్తిని ఎలా ఏక్సెప్ట్ చేసాడు అనేది స్టోరీ పాయింట్ అని చెప్తున్నారు.

    నాగార్జున ఈ చిత్రం పై మంచి కాన్పిడెంట్ గా ఉన్నారు..ఆయన మాట్లాడుతూ..."డమరుకం చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతం. 'ఈగ' స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని మించి 'డమరుకం' ఉంటుంది'' అని చెప్పారు. ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ.. ''నాగార్జున పాత్ర విభిన్నమైన రీతిలో ఉంటుంది. ఆయన తొలిసారి సోషియో ఫాంటసీ తరహా చిత్రంలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా గ్రాఫిక్స్‌ ఉంటాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నాము''అని ధర్శకుడు తెలిపారు. ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.

    ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్‌ నిర్మాత. ప్రకాష్‌రాజ్‌, గణేష్‌ వెంకట్రామన్‌, దేవన్‌, అవినాష్‌, బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, రఘుబాబు, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.

    English summary
    
 
 In Damarukam movie Nagarjuna role is an auto driver role and female lead role is Anushka essayed a girl with supernatural powers. This movie to add a extra flavor the opponent batch tries to kill Anushka and Nagarjuna takes the responsibility to save his heroine. The total concept linked to Lord Shiva and Kaialsam, and the next half is that a common man Nagarjuna fought against super powered evils. Movie sounds like Chiranjeevi’s JVAS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X