For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ రీమేక్ పై నాగార్జున ప్రత్యేక ఆసక్తి...స్పెషల్ స్క్రీనింగ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : వయస్సు పెరుగుతున్నా ఎక్కడా ఆ ఛాయలు కనపడకుండా మ్యానేజ్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న టాలీవుడ్ హీరో నాగర్జున. ఈ మన్మధుడు వరస ప్రాజెక్టులు, టీవి షోలతో బిజీగా ఉన్నారు. తాజాగ ఆయన ఓ రీమేక్ చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈమేరకు ఆయన స్పెషల్ స్క్రీనింగ్ వేసుకుని ఆ చిత్రం చూసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం టైటిల్ ...మైత్రి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  https://www.facebook.com/TeluguFilmibeat

  కన్నడంలో మొన్న ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. గిరి రాజ్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్, పునీత్ రాజకుమార్ నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం కన్నడ,మళయాళ వెర్షన్ లలో మంచి పేరు తెచ్చుకుని కలెక్షన్స్ కురిపిస్తోంది.ఇద్దరు స్టార్ హీరోలు చేసిన ఈ చిత్రం రీమేక్ లో నాగార్జున మరో హీరోతో కలిసి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

  Nagarjuna's special interest for Mythri remake!

  ముఖ్యంగా ఈ చిత్రంలో రియాలిటీ క్విష్ షో(మీలో ఎవరు కోటీశ్వరుడు తరహా) నడిపే హీరోగా పునీత్ కనిపించారు. ఆ పాత్రను నాగార్జున చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

  కన్నడ చిత్రం కథ విషయానికి వస్తే...జువైలరీ హోమ్ లో ఉంటే ...సిద్దరామ అనే కుర్రాడు...హీరో పునీత్ రాజ్ కుమార్ కి వీరాభిమాని. దాంతో పునీత్ ...నిర్వహిస్తున్న టీవి షోలో ..సిద్దరామ పాల్గొని...యాభై లక్షలు గెలుచుకోబోతాడు.అదే సమయంలో పునీత్ కు మహదేవ్( మోహన్ లాల్) అనే DRDO సైంటిస్టు నుంచి ఓ రిక్వెస్టు వస్తుంది. సిద్దరామని విన్నర్ గా చేయవద్దని కోరుతాడు. మాధవ్ చెప్పేదేమిటంటే... సిద్దరామ తన కుమారుడుని చంపేసాడు అని. ఆ సంఘటన వెనక ఓ టచింగ్ స్టోరీ ఉంటుంది.

  సిద్దరామ... గోలీ ప్రకాష్(రవికాలే) నడిపే చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ లో ఓ విక్టిమ్. అక్కడ నుంచి కథ ఓ డ్రమిటిక్ టర్న్ తీసుకుంటుంది. సిద్దరామ..తన తదుపరి ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి మహాదేవ్ సాయం అడుగుతాడు. అది విన్ అయితే కోటి వస్తుంది. ఆ డబ్బుని...రవి ప్రకాష్(అతుల్ కులకర్ణి) కి ఇచ్చి తాను ఉంటున్న రిమేండ్ హోమ్ ని బాగు చేయమని అడుగుతాడు. అసలు సిద్దరామ...ఎందుకు జైలుకు వెళ్లాడు. మోహన్ లాల్ కొడుకుని అతను చంపటానకి కారణం ఏమిటి... దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనేది ..సోషల్ మెసేజ్ తో నడిచే కథనం.

  Nagarjuna's special interest for Mythri remake!

  మరి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే...మోహన్ లాల్ పాత్రను తెలుగులో ఎవరు వేస్తారు. దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే నాగ్ చేస్తే తెలుగుకు ఇది కొత్త కథ అవుతుంది. అంతేకాక ఆయన చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాంకు బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది. స్లమ్ డాగ్ మిలియనీర్ తరహాలో నడిచే ఈ కథనం తెలుగువారికీ నచ్చే అవకాసం ఉంది.

  ప్రస్తుతం నాగార్జున చేస్తున్న చిత్రం విషయానికి వస్తే...

  నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా'. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.

  లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కధానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.

  English summary
  Nagarjuna has developed a special interest for a remake of a Kannada film, Mythri that will be screened specially for Nag by the makers of the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X