»   » ‘అఖిల్’ భారీ నష్టాలు మిగిల్చిందట! రంగంలోకి నాగ్!

‘అఖిల్’ భారీ నష్టాలు మిగిల్చిందట! రంగంలోకి నాగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ ను హీరోగా పరిచయం చుస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖిల్'. భారీ బడ్జెట్, భారీ తారాగణం, స్టార్ డైరెక్టర్, స్టార్ నిర్మాత ఇలా అన్నింటిలోనూ భారీ తనం ప్రదర్శించిన ఈ చిత్రం తొలి రోజు ఓపెనింగ్స్ భారీగానే సాధించింది.

అయితే సినిమా మిక్డ్స్ టాక్ రావడంతో సెకండ్ డే నుండే కలెక్షన్స్ డౌన్ అయ్యాయని తెలుస్తోంది. మొదటి రోజే 10 కోట్లు సాధించిన ఈ చిత్రం తర్వాత నాలుగు రోజుల్లో కేవలం ఆరు కోట్లు మాత్రమే కలెక్టు చేయటం ఇబ్బందికర అంశమే. కొద్దిలో కొద్ది కర్ణాటక...1.05 కోట్లు కలెక్టు చేసి రిలీఫ్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలే మిగిలాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున డిస్ట్రిబ్యూటర్లతో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చే సినిమాలను రిజనబుల్ రేటుకు ఇప్పిస్తానని నాగార్జున మాట ఇచ్చినట్లు సమాచారం.

Nagarjuna secret meeting?

బాక్సాఫీసు వద్ద సినిమా పరిస్థితి బావుంటే.... నిర్మాత నితిన్, డైరెక్టర్ వివి వినాయక్ సక్సెస్ మీట్ల హడావుడి ఉండేది. కానీ పరిస్థితి తిరగబడటంతో అటు నితిన్ తో పాటు ఇటు వివి వినాయక్ సైడ్ అయిపోయారని అంటున్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Film Nagar source said that, A secret meeting is said to have held between Nagarjuna and the mediators who are cooling down Akhil movie distributors. Couple of other Akkineni films theatrical rights are said to be promised for them at reasonable prices.
Please Wait while comments are loading...