»   » సిక్స్ పాక్ మొదలెట్టిన సీనియర్ హీరోలూ...

సిక్స్ పాక్ మొదలెట్టిన సీనియర్ హీరోలూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

వీరు పోట్ల దర్శక్వంలో కామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై డి. శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నఅక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం 'రగడ". అనుష్క, ప్రియమణి హీరోయిన్స్‌ గా నటించిన ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగార్జున పూర్తిగా రాయలసీమ యాసలో మాట్లాడతారు. కాగా ఈ చిత్రం గురించి నాగార్జున తనయుడు, యువ హీరో నాగచైతన్య ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ... 'చిన్నప్పుడు నాన్న షూటింగ్‌ లకు వెళ్లి అబ్జర్వ్‌ చేస్తూ అన్నీ నేర్చుకునే వాడ్ని. ఇప్పుడు హీరో అయ్యాక నాన్న 'రగడ" షూటింగ్‌ కి వెళ్లలేకపోయాను. చాలా బాధగా వుంది. సో.. మీకు సినిమా గురించి ఎంత తెలుసో నాకూ అంతే తెలుసు. కానీ నాన్న సిక్స్‌ ప్యాక్‌ లో కనిపిస్తాడట. రోజూ జిమ్‌ కి వెళ్తున్నారు. ఎలా వుంటారో చాలా ఎగ్జైటింగ్‌ గా వుంది" అన్నారు.

అనుష్క ఇంతకు ముందు నాగార్జునతో సూపర్, డాన్, తర్వాతి రగడ చిత్రంలో నటిస్తున్న సందర్బాగా నాగార్జున తో మొదటి సినిమా సూపర్ కి ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రగడలో నాగార్జునలో ఎటువంటి మార్సు లేదు. ఒక్క సిక్స్ పాక్ తప్పు అంటూ చాలా హ్యాడ్సమ్ గా కనిపిస్తాడన్నది. ఈ చిత్రం డిసెంబర్‌ 12న చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్నట్లు ఈ చిత్రంలో ఛార్మి కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu