»   » 'అరుంధతి' తరహా సోషియో పాంటసీ కమిటయిన నాగార్జున

'అరుంధతి' తరహా సోషియో పాంటసీ కమిటయిన నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున త్వరలో అరుంధతి తరహా ఓ సోషియో ఫాంటసీ చిత్రలో నటించబోతున్నారు. కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సన్నాహులు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం నాగార్జున గత చిత్రాల అన్నమయ్య, శ్రీ రామదాసు తరహా భక్తి రసం కూడా అంతర్గతంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇంతకు ముందుకూడా శ్రీనివాస రెడ్డి యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంతో సోషియో పాంటసీ తీసి ఒప్పించగలనని నిరూపించుకోవటంతో ఈ చిత్రం నాగార్జున ఓకే చేసినట్లు చెప్తున్నారు.

ఇక కిక్ వంటి సూపర్ హిట్ అందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రం నిర్మిచనున్నారు. అలాగే అరుంధతి తరహాలో గ్రాఫిక్స్ బాగా ప్రాముఖ్యముంటుందని, అతీత శక్తులతో హీరో పోరాట దృశ్యాలు చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. గగనం అనంతరం నాగార్జున చేయబోయే చిత్రం ఇదే. అలాగే అనుష్క కూడా ఈ చిత్రంలో అమ్మవారి పాత్రలో కనిపించే అవకాశం ఉందని బోగట్టా.

ప్రస్తుతం నాగార్జున..బిందాస్ దర్శకుడు వీరూ పోట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా చేసే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో గగనం అనే చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఇక శ్రీనివాస రెడ్డి అఆఇఈ, కుబేరులు వంటి చిత్రాల పరాజయంతో రీసెంట్ గా జోరు తగ్గింది. అలాగే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు రవితేజ హీరోగా గోపీచంద్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ డాన్ శ్రీను అనే చిత్రం చేస్తున్నారు. ఇక ఈ ఫాంటసీ చిత్రానికి సంభందించి అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ ఆగస్టు ఒకటవ తేదీన వచ్చే అవకాశం ఉంది.

Please Wait while comments are loading...