Just In
- 21 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛర్మిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, షాకిచ్చిన పంజాబ్
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఖరారు : 'ఏడు కొండలవాడు' గా నాగార్జున
హైదరాబాద్: గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు ల కాంబినేషన్ లో అన్నమయ్య చిత్రం వచ్చింది. వెంకటేశ్వరస్వామి భక్తుడుగా..తాళ్లపాక అన్నమాచార్యునిగా అందులో జీవించారు నాగార్జున. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆయన 'ఏడు కొండలవాడు' అనే టైటిల్ తో ఓ భక్తిరస ప్రధాన చిత్రం కమిటయ్యారని సమచారం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
గతంలో నాగార్జునతో షిర్డీ సాయి చిత్రం నిర్మించిన మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎప్పటిలాగే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రూపొందనుంది. ఇలాంటి చిత్రాల రచనలో అందె వేసేన చెయ్యి అయిన భారవి సైతం ఈ ప్రాజెక్టుకు పనిచేస్తున్నట్లు సమాచారం. ఏప్రియల్ నుంచిషూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు.

అయితే ఇందులో వెంకటేశ్వరస్వామిగానే నాగార్జున కనిపిస్తారని వెంకటేశ్వర మహత్యం చిత్రం తరహా పౌరాణిక గాధ అని వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజముందనేది ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యి అధికారిక ప్రకటన వచ్చేకే తెలుస్తుంది.
ప్రస్తుతం నాగార్జున చేస్తున్న చిత్రం విషయానికి వస్తే...
నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా'. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.
లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కధానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.