»   » మణిరత్నం అశోసియేట్ దర్శకత్వంలో నాగార్జున

మణిరత్నం అశోసియేట్ దర్శకత్వంలో నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నంతో గీతాంజలి చిత్రం చేసిన నాగార్జున తాజాగా ఆయన అశోసియేట్ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆ చిత్రాన్ని నాగార్జున సోదరి నాగసుశీల నిర్మించనుంది. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు చెప్తున్నారు.ఇక నాగార్జున మొదట ఈ కథను విని ఓకే చేసిన తర్వాతే ప్రాజెక్టు ముందుకు వెళ్థోందని చెప్తున్నారు. అయితే ఆ దర్శకుడు పేరు ఏమిటన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం నాగార్జున ...వీరూపోట్ల(బిందాస్ దర్శకుడు) డైరక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నారు. కేడీ,కింగ్ చిత్రాల నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. అలాగే నాగార్జున...రాధామోహన్(ఆకాశమంత ఫేమ్) దర్శకత్వంలో గగనం అనే చిత్రం చేస్తున్నారు. దిల్ రాజు దానిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆర్.ఎఫ్.సి లో షూటింగ్ జరుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu