నాగ్ 'భాయ్' చిత్రం ఆ మలయాళ కాపీనా?
పొక్కిరి రాజా లో కథ...పూర్తి మాస్ మసాలా గా సాగుతుంది. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన కుర్రాడు... సిటీలో డాన్ గా ఎదిగి...తన తమ్ముడుని సేవ్ చేయటానికి తన ఐడింటీటీ బయిట పెట్టకుండా తన ఊరు వస్తాడు. అక్కడ నుంచి జరిగే యాక్షన్ కామెడీ నే సినిమా కథ. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్ గా చేసింది. ముమ్మట్టి లోకల్ డాన్ గా ఫన్ చేస్తూంటాడు. అతని వచ్చి రానీ ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇదే కథను భాయ్ గా చేస్తున్నాడంటున్నారు. అయితే...సినిమా రిలీజైతే కానీ ఏ విషయం తెలియదు.
ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ గురించీ, పాతబస్తీలో భాయ్ గురించీ తెలియని వాళ్లుండరు. మంచి కోసం, మనీ కోసం ఏదైనా చేస్తాడు. కాకపోతే కాస్త మొండిఘటం. ఎవరి మాటా వినడు. బరిలో దిగితే వెనక్కి తిరిగి చూడడం తెలీదు. ఆ వేగమే అతని ఆయుధం. ఇంతకీ భాయ్ సిటీకి ఎందుకొచ్చాడు? ఇక్కడ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు వీరభద్రమ్.
'భాయ్' లో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్ద నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో నాగార్జున, సోనూసూద్‌లపై పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ''నాగార్జున పాత్ర, ఆయన పలికే సంభాషణలు మాస్‌కి బాగా నచ్చుతాయి. ఆయన్ని అభిమానులు ఎలా చూడాలనుకొంటున్నారో.. అలానే తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తాము''అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












