»   »  లారెన్స్ పై రివెంజ్ తీర్చుకున్న నమిత

లారెన్స్ పై రివెంజ్ తీర్చుకున్న నమిత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Namitha
లారెన్స్ హీరోగా చేసిన 'పార్ధు' సినిమాలో నమిత పక్కా మాస్ క్యారెక్టర్ పేరుతో రెచ్చిపోయి అందాలు ఆరబోసిందనే సంగతి తెలిసిందే. అయితే ఆ షూటింగ్ సమయంలో లారెన్స్ ప్రత్యేకమైన సమయం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆమెను పిలిచేవాడుట. ఒక్కోసారి అది అర్ధరాత్రి మూడున్నర సమయమైనా ఆగేవాడుకాదట. దాంతో నమితకు ఆ షూటింగ్ జరిగనన్ని రోజులూ నరకం కన్పించిందింట. అయితే ఎవరికీ చెప్పుకునే పొజీషన్ కాదు. అందులోనూ లారెన్స్ డాన్స్ మాస్టర్ కూడా కావటంతో ఫామ్ లో ఉన్న పెద్ద హీరోలంతా అతని పక్షమేనట. దాంతో ఒప్పుకున్న పాపానికి కిక్కురుమనకుండా అతనితో టైము స్పెండు చేయాల్సి వచ్చేదిట. ఇది మనసులో పెట్టుకున్న ఆమె అవకాశం కోసం ఎదురు చూస్తోందిట.


ఈలోగా సుందర్ .సి హీరోగా దర్శకుడు శక్తి చిదంబరం డైరక్ట్ చేసిన సినిమా పెద్ద హిట్టవటంతో ...లారెన్స్ అతన్ని ఓ సినిమా చేసిపెట్టమన్నాడుట. అయితే శక్తి చిదంబరం కి నమిత ఎంత చెబితే అంత అన్నంత అండరస్టాండింగ్ ఉందిట.అందులోనూ నమిత కాంబినేషన్ అంటే భారీ స్ధాయిలో బిజెనెస్ జరుగుతుందనే ఆశ ఉందిట. ఇది అర్ధం చేసుకున్న నమిత తాను లారెన్స్ హీరోగా చేసే సినిమాలో చిన్న పాత్ర కూడా చేయలేనని తెగేసి చెప్పిందిట. లారెన్సా,నమితా తెల్చికోమన్నంతగా పట్టుబట్టిందిట. దాంతో శక్తి చిదంబరం డైలమాలో పడ్డాడుట. లారెన్స్ కి ఇంతకు ముందు ఉన్న క్రేజ్ అక్కడ లేదుట. ఇక తెలుగులోనూ అంతంత మాత్రమే. ఏదో కాస్త క్రేజ్ ఉన్న దర్శకుడు చేతిలో పడితే ప్రశాంతంగా హీరో గా సెటిలవ్వ వచ్చు అన్న ఆశ అడియాశ అయ్యేలా ఉందిట. అలా నమిత అతనిపై రివేంజ్ తీర్చుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X