బాలకృష్ణతో జోడీకి సై.. సిద్ధమైన యంగ్ హీరోయిన్.. బోయపాటి ప్రయత్నానికి ఫుల్‌స్టాప్!

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాను హీరోయిన్ కష్టాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసి రెగ్యులర్ షూట్ కోసం రెడీ అవుతున్నారు. అయినప్పటికీ హీరోయిన్ కన్ఫర్మ్ కాకపోవడంతో బోయపాటి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ ఓకే చెప్పేసిందని తాజా సమాచారం. వివరాల్లోకి పోతే..

నో చెప్పిన కీర్తి సురేష్

నో చెప్పిన కీర్తి సురేష్

కాల్షీట్ల స‌మ‌స్య‌వల్లో, లేదంటే ఇతర కారణం ఏదైనా ఉందో తెలీదు గానీ.. కీర్తి సురేష్ ఈ సినిమా చేయ‌డానికి ససేమిరా నో అనేసిందట. దీంతో ఆ తర్వాత కొందరు యంగ్ హీరోయిన్స్‌ని సంప్రదిస్తే అక్కడి నుంచి కూడా ఇలాంటి రెస్పాన్సే వచ్చిందని వార్తలు వచ్చాయి.

కేథరిన్‌ని సంప్రదిస్తే.. ఆమె డిమాండ్

కేథరిన్‌ని సంప్రదిస్తే.. ఆమె డిమాండ్

ఆ తర్వాత హీరోయిన్ కేథరిన్‌ని సంప్రదించారని, ఈ సినిమా కోసం ఆమెను ఫైనల్ కూడా చేశారని టాక్ నడించింది. కానీ ఇటీవలే ఆమె ఈ సినిమా చేయడం లేదని మరికొన్ని వార్తలు ఊపందుకున్నాయి. బాలయ్య సరసన నటించేందుకు గాను కేథరిన్ పారితోషికం చాలా ఎక్కువగా అడిగిందట. దీంతో ఆమెను పక్కన పెట్టేసి మరో కథానాయిక కోసం బోయపాటి టీమ్ ప్రయత్నాలు స్టార్ట్ చేసిందని అన్నారు.

సై అనేసిన యంగ్ హీరోయిన్

సై అనేసిన యంగ్ హీరోయిన్

ఇకపోతే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు యంగ్ హీరోయిన్ అంజలి ఓకే అనేసిందని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన ఈమె బాలకృష్ణతో జోడీ కట్టేందుకు సిద్దమైందట. దీంతో బోయపాటి ప్రయత్నానికి ఫుల్‌స్టాప్ పడ్డట్టే అని అంటున్నారు .

బోయపాటి స్కెచ్.. ఇకపై చకచకా

బోయపాటి స్కెచ్.. ఇకపై చకచకా

బాలయ్య- బోయపాటిది సక్సెస్‌ఫుల్ కాంబో కావడంతో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంతలో ఫినిష్ చేస్తారు అనే దానిపై బాలకృష్ణ అభిమానులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసి.. షూటింగ్ అంతా చకచకా ఫినిష్ చేసేలా బోయపాటి స్కెచ్ రెడీ చేశారట.

Recommended Video

Ruler Movie Success Meet | Balakrishna | KS Ravi Kumar
మే నెలాఖరులో రిలీజ్.. ఇదీ ప్లాన్

మే నెలాఖరులో రిలీజ్.. ఇదీ ప్లాన్

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాను తమన్ సంగీతం అందించనున్నాడు. తాజా సమాచారం మేరకు కమెడియన్ సునీల్‌ను కూడా విలన్ పాత్రకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసి మే నెలాఖరులో ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X