Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 3 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 3 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- Finance
మార్కెట్ మహా పతనం, ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు మటాష్
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోజా ఓకే చెప్పింది.. బాలయ్య కష్టాలు షురూ.. బోయపాటి స్కెచ్ వర్కవుట్ కాలేదా?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసి రెగ్యులర్ షూట్ కోసం రెడీ అవుతోంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో హీరోయిన్ వేట మొదలైందని, అందులో భాగంగానే ఊహించని రీతిలో బాలకృష్ణకు కష్టాలు మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. ఆ వివరాలు చూద్దామా..

స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు.. బాలయ్య సరసన హీరోయిన్
ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా చేసే ఛాన్స్ రావడంతో స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట బోయపాటి. నటీనటులు, బాలయ్య సరసన నటించనున్న హీరోయిన్ విషయంలోనూ ఎంతో జాగ్రత్త పడుతున్నారట.

బోయపాటి స్కెచ్.. యంగ్ హీరోయిన్ రియాక్షన్
ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ స్కెచ్ వేసిన బోయపాటి.. బాలయ్య సరసన కీర్తి సురేష్‌ని ఎంపిక చేసి ఆమె క్రేజ్ కూడా సినిమాకు బోనస్ అయ్యేలా ప్లాన్ చేశారట. ఇందులో భాగంగా ఇప్పటికే కీర్తి సురేష్‌కి కథ కూడా వినిపించారట బోయపాటి. కానీ ఆమె మాత్రం ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించిందని లేటెస్ట్ సమాచారం.

బాలయ్యకు హీరోయిన్ కష్టాలు
కాల్షీట్ల సమస్యవల్లో, లేదంటే ఇతర కారణం ఏదైనా ఉందో తెలీదు గానీ.. కీర్తి సురేష్ ఈ సినిమా చేయడానికి ససేమిరా నో అనేసిందట. దీంతో ఆ తర్వాత కొందరు యంగ్ హీరోయిన్స్‌ని సంప్రదిస్తే అక్కడి నుంచి కూడా ఇలాంటి రెస్పాన్సే వచ్చిందని తెలుస్తోంది. దీంతో బాలయ్యకు హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయని చెప్పుకుంటున్నారు జనం.

రోజా ఓకే.. అనసూయ కూడా
ఇప్పటికే ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే పాత్రలో రోజాను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. రోజా కూడా బాలయ్యను ఢీ కొట్టేందుకు సిద్ధమైందని, నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది టాక్ నడుస్తోంది. అలాగే అనసూయను కూడా ఓ ముఖ్యపాత్ర కోసం సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తను మించిన క్యారెక్టర్ ఈమె కోసం డిజైన్ చేశారట బోయపాటి.

ప్రస్తుతం బాలయ్య బాబు
ఇక ఇదిలాఉంటే దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం తన 105వ సినిమా 'రూలర్'తో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా విడుదల కాగానే బోయపాటి శ్రీను సెట్స్ పైకి వెళ్లనున్నారు బాలకృష్ణ.