»   » నందమూరి ఫ్యామిలీ వార్....ఎంత వరకు వెలుతుందో?

నందమూరి ఫ్యామిలీ వార్....ఎంత వరకు వెలుతుందో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి వారసుల మధ్య విబేధాలు ఉన్నాయా? అనేది ఇంత వరకు కేవలం సమాధానం లేని ప్రశ్నగానే ఉండేది. కానీ ఇటీవల ‘నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుకలో సీన్ చూసాక అందరూ విబేదాలు ఉన్నాయని అని నమ్ముతున్నారు. మరో వైపు నందమూరి అభిమానుల్లో కూడా ఈ విషయమై హాట్ హాట్ చర్చ సాగుతోంది.

నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో హరికృష్ణ, కళ్యాణ్ రామ్ చేసిన ప్రసంగాలు...ఆసక్తికరంగా సాగాయి. సీనియర్ ఎన్టీఆర్ నిజమైన వారసుడు జూ ఎన్టీఆర్ మాత్రమే అనే విధంగా హరికృష్ణ ప్రసంగం సాగింది. తాను తారక రాం అని పెట్టగా...రెండో తరం వారసుడిగా అవుతాడని తన తండ్రి(ఎన్టీఆర్) తారక్ పేరును నందమూరి తారక రామారావు అని మార్చారని హరికృష్ణ స్వయంగా చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా ఇండైరక్ట్ గా ఎన్టీఆర్ కు అసలు సిసలు వారసుడు జూనియర్ బాబు మాత్రమే అని చెప్పకనే చెప్పారు. హరికృష్ణ ప్రసంగంలో ఎక్కడా బాలకృష్ణ ప్రస్తావనే లేక పోవడం గమనార్హం.

మరో వైపు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...తమ తండ్రి హరికృష్ణ ఆయన తండ్రి(సీనియర్ ఎన్టీఆర్‌)ని చూసుకున్నంత గొప్పగా ఎవరూ చూసుకోలేదని, ఆయన తండ్రి కోసం ఎన్నో త్యాగాలు చేసారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. తండ్రి కోసం తన జీవితాన్ని మొత్తం ధారపోసిన వ్యక్తి హరికృష్ణ అని పేర్కొన్నారు.

Nandamuri family war

గతంలో పరిస్థితి వేరు....
చంద్రబాబు అండ్ కో కలిసి...ముఖ్యమంత్రి పదవి నుండి తనను దించాక నా రాజకీయ, సినీ వారసుడు బాలయ్యేనని సీనియర్ ఎన్టీఆర్ ప్రకటించడం అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ సమయంలో హరికృష్ణ చంద్రబాబు పక్షాన ఉండటమే అందుకు కారణం. కాని ఇపుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది. కాలం గడిచే కొద్దీ బాలయ్య క్రమ క్రమంగా చంద్రబాబు పక్షాన చేరాడు. చంద్రబాబుకు వీయంకుడు అయిపోయాడు.

ఒకప్పుడు చంద్రబాబు పక్షాన ఉన్న హరి కృష్ణ ఇపుడు పూర్తిగా వ్యతిరేక పక్షం అయిపోయాడు. ఈ నేపథ్యంలో..... తన తండ్రి విషయంలో ఉన్న అపోహలను, చేసిన త్యాగాలను జనాల్లోకి తీసుకెళ్లడానికే ‘నాన్నకు ప్రేమతో' ఆడియో వేదికను వేదికగా చేసుకున్నారని స్పష్టమవుతోంది.

‘నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుక సాక్షిగా....... స్వర్గీయ నందమూరి తారక రామరావు అసలైన వారసులం మేమే అని ప్రకటించుకున్నారు హరికృష్ణ ఫ్యామిలీ. నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుకలో చోటు చేసుకున్న పరిణామాలు నందమూరి ఫ్యామిలీలో విబేధాలకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. బాలయ్య అభిమానులు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ప్రసంగాలను జీర్ణించుకోలేక పోతున్నారు.

English summary
Balakrishna fans could not stomach the statement made by NTR's dad at the event hailing Young Tiger as the real heir of Sr NTR.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu