For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆడియో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా జూ.ఎన్టీఆర్

  By Srikanya
  |

  హైదరాబాద్: జూ.ఎన్టీఆర్ వేరే వారి ఆడియో పంక్షన్స్ కు అరుదుగా వెళ్తూంటారు. తాజాగా ఆయన తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం ఓం ఆడియో పంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లటానికి సమ్మతించారని తెలుస్తోంది. అన్నదమ్ములు ఇద్దరూ తొలిసారి ఇలా పబ్లిక్ పంక్షన్ లో పాల్గొనటం అవుతుంది. అలాగే బాలకృష్ణ కూడా ఈ పంక్షన్ కి వస్తారని చెప్పుకుంటున్నారు.

  ఈ చిత్రం ఆడియో వేడుకను ఈ నెలాఖరున జరపనున్నారు. అతనొక్కడే చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంత కాలం నుంచి త్రీడి చిత్రం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై త్రీడీ స్టీరియోఫోనిక్‌ విధానంలో 'ఓం' చిత్రాన్ని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఛాయాగ్రాహకుడు సునీల్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్ . షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

  కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానమైన కథ, కథనాలతో చిత్రం సాగుతుంది. ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం జత కూడాయి. యాక్షన్‌ అంశాలు ఎక్కువగా ఉన్న చిత్రాన్ని త్రీడీలో చూపించడం కత్తి మీద సాములాంటిదే. చిత్రీకరణ మొదలుపెట్టడానికి ఎనిమిది నెలల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగించాం.

  అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశాం. స్టెప్‌ అప్‌3, ఫైనల్‌ డెస్టినేషన్‌, స్పైడర్‌మేన్‌4, అవతార్‌, రెసిడెంట్‌ ఈవిల్‌ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్‌ ఎపిక్‌, త్రీడీ రిగ్‌ కెమెరాలు, లెన్స్‌లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్‌ చేశాం. గత ఏడు నెలలుగా అమెరికా, సింగపూర్‌ల్లో త్రీడీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి. ఈ వేసవిలో విడుదలవుతుంది''అన్నారు.

  ఈ నెలలో పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చేందుకు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్నారు ఈ దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

  ఇక సునీల్ రెడ్డి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్ శిష్యుడు. ఆయన వద్ద భగీరధ, ఒకరికి ఒకరు చిత్రాలకు పనిచేసారు. ఆయన మంచు మనోజ్ తో చేసిన నేను మీకు తెలుసా చిత్రం బాగా పేరు తెచ్చుకుంది. నందమూరి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు, సాంకేతిక విభాగానికీ ప్రాధాన్యం ఇస్తూ 'ఓం' చిత్రాన్నినిర్మాస్తున్నారు. ఇంతకు ముందు తన భ్యానర్ లో కళ్యాణ్ రామ్ అతనొక్కడే, హరేరామ్, జయీభవ చిత్రాలు నిర్మించారు. కత్తి చిత్రం ప్లాపు కావడంతో... ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు.

  English summary
  Nandamuri KalyanRam’s big budget movie OM audio would be held in May last week. This film is FIRST TELUGU ACTON MOVIE IN 3D .Currently the movie is in post-production stage and KalyanRam has big plans for the audio function. If the buzz is to be believed, the entire NTR will be present for the audio function as Guest.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X