»   » అసెస్టెంట్ డైరక్టర్ గా నందమూరి మోక్షజ్ఞ,బాలయ్య గ్రీన్ సిగ్నల్

అసెస్టెంట్ డైరక్టర్ గా నందమూరి మోక్షజ్ఞ,బాలయ్య గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ...అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేయటమేంటి..నమ్మబుద్ది కావటం లేదా..అయితే ఇది నిజమే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తన తండ్రి హీరోగా చేస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు అసిస్టెంట్ గా పనిచేయాటనికి ముందుకు వచ్చాడంటున్నారు.

వచ్చే సంవత్సరం లాంచ్ అవటానికి రంగం సిద్దం చేస్తున్న ఈ సమయంలో బాలయ్య ఈ డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. దాంతో లైవ్ ఎక్సపీరియన్స్ ఉంటుందని, అలాగే డైరక్టర్ కష్టాలు తెలుస్తాయని, తద్వారా డైరక్టర్స్ తో ఎలా మెలగాలి, వాళ్లకు అణుగుణంగా తమను తాము ఎలా మలుచుకోవాలననే విషయాలు తెలిసేందుకు అవకాసం ఉందని చెప్పుకంటున్నారు.

ఇక మొదట మోక్షజ్ఞ..ఈ చిత్రంలో బాలయ్య కుమారుడు గా ఓ కీలకమైన పాత్రలో కనపడతారన్నారు. కానీ ఈలోగా మోక్షజ్ఞ వచ్చి ఈ నిర్ణయం చెప్పటంతో బాలయ్య చాలా సంతోషించాడని, వెంటనే క్రిష్ కి చెప్పి డైరక్షన్ డిపార్టమెంట్ లో చేర్పిచారని వార్త. బాలయ్య కూడా ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ వద్ద అసెస్టింట్ గా పనిచేసారు.

 Nandamuri Mokshagna as Asst Director to GPSK?

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర మొన్న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలయ్య అత్యంత ప్రతిష్మాత్మకంగా ఈ చిత్రాన్ని భావించి పనిచేస్తున్నారు. అభిమానులు సైతం ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలయ్య మాట్లాడుతూ...వందో చిత్రం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని భావించా...అందుకోసం ఎన్నో కథలు విన్నా...కొన్ని నచ్చాయి...కొన్ని నచ్చలేదు...అయినా వందో సినిమా స్థాయికి తగిన చిత్రంగా అవేమీ నాకు సంతృప్తి కలిగించలేకపోయాయి. సరిగ్గా ఆసమయంలో క్రిష్ చెప్పిన కథ నచ్చింది. గౌతమీ పుత్ర శాతకర్ణి కచ్చితంగా గొప్ప చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం కలిగిందని బాలకృష్ణ అన్నారు. అని బాలకృష్ణ అన్నారు.

English summary
Balayya's son Mokshagna will be turning as Assistant Director for director Krish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu