»   »  మోక్షజ్ఞ ఎంట్రీ...ఈ యేడాదే...డిటేల్స్

మోక్షజ్ఞ ఎంట్రీ...ఈ యేడాదే...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ వార్త నిజమైతే నందమూరి అభిమానులకు ఇది పండుగలాంటి న్యూసే. బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఈ సంవత్సరమే ఎంట్రీ కాబోతున్నాడు. మోక్షజ్ఞ..అమెరికాలో మేనేజ్ మెంట్ కోర్స్ పూర్తి చేసుకుని వచ్చారు.చదువుతో పాటే డాన్స్, నటనలలో ట్రైనింగ్ తీసుకున్నారు. అయితే మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ కు ట్రైల్ లాంటి సినిమా అదీ సీనియర్ దర్శకుడుతో చేయించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అది మరేదో కాదు...

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా ఆదిత్య 369. దీనికి సీక్వల్ గా తీయబోతున్న సినిమా ఆదిత్య 999, ఈ సినిమాను బాలయ్య 100వ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Nandamuri Mokshagna Teja Debut Movie Confirmed

ఇప్పటికే సింగీతం ఈ సినిమాకు సంబందించి కథ కూడా రెడీ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇది సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుందని, ఈ సినిమాలో కీలక పాత్ర అయిన యువరాజుగా, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞతో చేయించాలని ఆలోచిస్తున్నారట డైరక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. బాలయ్య కూడా ఇదే ఆలోచనలో ఉండటంతో వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై దృష్టిపెట్టిన నందమూరి ఫ్యామిలీ, ఈ విషయం పై కూడా ఆలోచిస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం బాలకృష్ణ తన 99 వ సినిమా డిక్టైటర్ సినిమా విడుదల పనుల్లో బిజిగా వున్నారు.

English summary
Nandamuri Mokshagna Teja going to act in a character of Prince in ‘Aditya 999’ movie.
Please Wait while comments are loading...