»   » తారకరత్నకు మరో ఆఫర్...మెగా హీరోకు విలన్ గా ?

తారకరత్నకు మరో ఆఫర్...మెగా హీరోకు విలన్ గా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో నుంచి తప్పుకుని విలన్ గా చేయటం తారకరత్నకు కలిసి వచ్చేటట్లే కనపడుతోంది. ఆయన తాజా చిత్రం "రాజా చెయ్యి వేస్తే" రిజల్ట్ ఎలా ఉన్నా..విలన్ గా ఆయనకు మంచి పేరే తెచ్చి పెట్టింది. ఈ నేపధ్యంలో ఆయనకు మరో సినిమా ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అది మరేదో కాదు. మెగా హీరో చిత్రం నుంచి.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ హీరోగా రూపొందనున్న చిత్రంలో విలన్ పాత్ర కోసం తారకరత్నను సంప్రదించినట్లు సమాచారం. తారకరత్న కూడా అందుకు సముఖంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

Nandamuri Tarakaratna get 'Mega' offer

సాయిధరమ్ తేజ కూడా నందమూరి క్యాంప్ కు మొదటినుంచి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. రాజా చెయ్యి వేస్తే చిత్రం రిలీజ్ సందర్భంగా చిత్రం విజయవంతం కావాలని బెస్ట్ విషెష్ కూడా చెప్పారు. ఈ నేపధ్యంలో ఆయన రాజా చెయ్యి వేస్తే చూసి, తారకరత్న నటనకు ఇంప్రెస్ అయ్యి...తన సినిమాకు రికమెండ్ చేసాడంటున్నారు.

ఇక సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nandamuri Tarakaratna get 'Mega' offer

దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ..''అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. జూన్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. వైజాగ్, హైదరాబాద్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది'' అని తెలిపారు.

సాయిధరమ్ తేజ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి మంచి కథ, మంచి టీమ్ కుదిరిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: చోటా కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాశ్, దర్శకత్వం: గోపిచంద్ మలినేని.

English summary
Director Gopichand Malineni has contacted Tarakaratna, if he could play villain his upcoming film with Saidharam Tej.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu