»   » ‘అలా మొదలైంది’ నందిని రెడ్డి నెక్స్ట్ ఆ మాస్ హీరోతో కన్ఫర్మ్

‘అలా మొదలైంది’ నందిని రెడ్డి నెక్స్ట్ ఆ మాస్ హీరోతో కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అలా మొదలైంది" లాంటి హిట్ చిత్రం అందించిన నందిని రెడ్డి త్వరలో...రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో సమంత హీరోయిన్ గా చేసే ఉందని తెలుస్తోంది. మొదట ఆమె సిద్దార్ధ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా సినిమా చేయటానకి అడ్వాన్స్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సిద్దార్ద వరసగా సినిమాలు చేస్తూ డేట్స్ ఇవ్వలేని స్ధితిలో ఉండటం, నేరేట్ చేసిన కథలో పలు మార్పులు చెప్పటం నందినీ రెడ్డికి నచ్చలేదుట. 'అలా మొదలైంది" చిత్రం కేవలం తను తయారు చేసుకున్న స్క్రిప్టు వల్లనే ఆడిందని,తనకు స్క్రిప్టు పాఠాలు నేర్పాల్సన పనిలేదని ఆమె ఈ ప్రాజెక్టు కాదనుకుందని ఫిల్మ్ నగర్ సమాచారం. అందులోనూ సిద్దార్ధ దర్సకులకు పూర్తి స్వేచ్చ ఇవ్వరని,అన్నివిషయాల్లోనూ వేలు పెడుతూంటారని కూడా తెలిసిన ఆమె విరమించుకుని రవితేజతో ముందుకు వెళ్థోందిట. ఈ చిత్రానికి కూడా బెల్లంకొండ నిర్మాత అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రవితేజ తనకు సరపడ రెమ్యునేషన్ ఇస్తే చాలు సినిమా ఓకే అనే స్ధితిలో ఉండటం కూడా కలిసి వచ్చే అంశం.

English summary
Nandini Reddy – Ravi Teja’s combination has been finalized. The official announcement of the film is yet to be made, soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu