‘అంటే సుందరానికీ’ కథ అదేనా.. నాని కొత్త సినిమా స్టోరీ లీక్!
నాని ఏదైనా సినిమాకు ఓకే చెప్పాడంటే అందులో ఏదో ఒక కొత్త పాయింట్.. కొత్తదనం ఉంటుందని అందరూ ఆశిస్తారు.. అంచనాలు పెంచుకుంటారు. ముఖ్యంగా నాని నటనను ఆస్వాధించేందుకు రెడీగా ఉంటారు. నాని కామెడీ చేసి నవ్వించినా.. ఏడిపించినా అది ఎంతో న్యాచురల్‌గా ఉంటుంది. అందుకే నాని న్యాచురల్ స్టార్ అయ్యాడు. అలాంటి నాని తాజాగా ఓ కొత్త సినిమాను ప్రకటించాడు. అంటే సుందరానికీ అంటూ కర్టన్ రైజర్‌తొనే ఎన్నో అంచనాలు మరెంతో ఆసక్తిని పెంచాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి మంచి కామెడీ ఎమోషనల్ చిత్రాలను తీసి అందరి చేత వావ్ అనిపించుకున్నాడు వివేక్ ఆత్రేయ. అలాంటి దర్శకుడితో నాని కలిస్తే ఆసినిమా ఎలా ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. ఈ సినిమాలోనూ ఎమోషన్స్, కామెడీ పీక్స్‌లో ఉండబోతోన్నాయని తెలుస్తోంది.

బ్రాహ్మణుడి పాత్రలో...
తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ బయటకు వచ్చింది. బయట చక్కర్లు కొడుతున్న కథనం ప్రకారం.. ఈ సినిమాలో నాని ఓ బ్రాహ్మణ అబ్బాయి. ఇంట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. అలాంటి అబ్బాయి... ఓ క్రీస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తాడట. ఇక ఆ అమ్మాయి కూడా బ్రాహ్మణురాలే అని అబద్దామాడుతాడట.

అలా కామెడీ..
అయితే క్రిస్టియన్ అయిన హీరోయిన్‌ను బ్రాహ్మణురాలిగా మార్చడం, ఆ పద్దతులు, భాష, యాస ఆచారాలు నేర్పేందుకు, మ్యానేజ్ చేసేందుకు నాని కష్టాలు పడతాడట. అలా ఆ సీన్స్‌లో వినోదం బాగా పండుతుందని సమాచారం. అయితే బ్రాహ్మణుడిగా నాని.. ఎన్టీఆర్, బన్నీలా ఇరగదీస్తాడా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా..
నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ చేస్తున్నాడు.దీని తరువాత రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో శ్యామ్ సింఘరాయ్ అనే మరో సినిమాను చేస్తున్నాడు. ఇది పునర్జన్మల కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడని టాక్. దీని తరువాత అంటే సుందరానికీ లైన్‌లోకి వస్తుంది.


Click it and Unblock the Notifications











